జిహాదీ గ్రూపులతో పాకిస్థాన్‌కు ఉన్న సంబంధాలను ఎట్టకేలకు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్వయంగా అంగీకరించారు. రష్యాకు వ్యతిరేకంగా ముజాహిదీన్లకు పాక్ శిక్షణ ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
1980ల్లో ఆఫ్గానిస్థాన్‌ను ఆక్రమించిన సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు.. ముజాహిదీన్లకు పాక్ శిక్షణ ఇచ్చిందని ఇమ్రాన్ వెల్లడించారు. ఇందుకు అమెరికా ఆర్థిక సాయం చేసిందని ఆయన స్పష్టం చేశారు.
నాడు సాయం.. నేడు అపవాదం
1980 నుంచి సరిగ్గా పదేళ్ల తరువాత ఆఫ్గానిస్థాన్‌లో ప్రవేశించిన అమెరికా.. ఇప్పుడు పాకిస్థాన్‌లోని ముజాహిదీన్లను ఉగ్రవాదులుగా పేర్కొంటోందని ఇమ్రాన్ ఆరోపించారు. ఇదే పెద్ద వైరుధ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాతో పోరాడే సమయంలో పాక్ తటస్థంగా ఉంటే... నేడు ఈ అపవాదు ఎదుర్కోవాల్సి వచ్చేది కాదన్నారు ఇమ్రాన్. ఒకప్పుడు తమ నుంచి సాయం పొందిన అమెరికా ఇప్పుడు తమకే వ్యతిరేకంగా మారిందని ఇమ్రాన్ అన్నారు.
ముజాహిదీన్ల పోరాటం ఫలితంగా పాక్.. 70 వేల మంది ప్రాణాలను కోల్పోయిందని, 10 వేల కోట్ల డాలర్లు నష్టపోయిందని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఆఫ్గానిస్థాన్‌లో అమెరికా విజయం సాధించకపోవటంతో.. పాక్‌ను నిందిస్తోందన్నారు. ఇది చాలా అన్యాయమని ఇమ్రాన్‌ఖాన్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: వైభవంగా 'లాల్బాగ్కా రాజా' గణేశుని శోభాయాత్ర