ETV Bharat / international

చైనా సైన్యానికి జిన్​పింగ్​ కీలక ఆదేశాలు

author img

By

Published : Jan 5, 2021, 9:31 PM IST

Updated : Jan 5, 2021, 9:50 PM IST

చైనా సైన్యానికి మరోసారి కీలక ఆదేశాలు జారీ చేశారు ఆ దేశ అధ్యక్షుడు జిన్​పింగ్​. ఏ సమయంలోనైనా శత్రువులతో పోరాడటానికి సిద్ధంగా ఉండాలని.. ఆ విధంగా సైనికులను తయారు చేసేలా కఠిన శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించినట్లు ఆ దేశ అధికార వార్త పత్రిక జినువా పేర్కొంది.

Xi Jinping orders Chinese military to scale up combat readiness to 'act at any second'
సైన్యానికి జిన్​పింగ్​ కీలక ఆదేశాలు-'సిద్ధంగా ఉండండి'

యుద్ధ సన్నద్దతపై చైనా సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు ఆ దేశ అధ్యక్షుడు జిన్​పింగ్​. శత్రువులను ఎదుర్కొవడానికి ఏ సమయంలోనైనా సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ఎలాంటి కఠిన వాతావరణ పరిస్థితుల్లోనైనా పోరాటం చేసేలా సైనికులకు కఠిన శిక్షణ ఇవ్వాలని జిన్​పింగ్ అధికారులకు సూచించినట్లు చైనా అధికారిక మీడియా సంస్థ జినువా పేర్కొంది. దీనికోసం వాస్తవ పోరాట పరిస్థితులను సృష్టించాలని జిన్​పింగ్ చెప్పినట్లు వెల్లడించింది.

" ఏ సమయంలోనైనా పూర్తి స్థాయిలో పోరాడటానికి పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ(పీఎల్ఏ)​ సిద్ధంగా ఉండాలి. సైనికుల సామర్థ్యాలను మెరుగుపర్చడానికి కఠిన శిక్షణ ఇవ్వాలి. శిక్షణ, సాంకేతికత స్థాయిని మెరుగుపరచడం అవసరం." అని జిన్​పింగ్ అన్నారు.

దేశ భద్రతా దళాలను బలోపేతం చేయడానికి, శత్రువులపై విజయం సాధించేలా సైనికలు సామర్థ్యాన్ని పెంపొందించేలా శిక్షణ ఇవ్వాలని సెంట్రల్​ మిలటరీ కమిషన్​(సీఎంసీ)కి ఆదేశాలు జారీ చేస్తూ.. 2021లో తొలి సంతకం చేశారు జిన్​పింగ్​. నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించేలా శిక్షణ ఇవ్వాలని సూచించారు.

కమ్యూనిస్ట్​ పార్టీ ఆఫ్​ చైనాను స్థాపించి జూలై 1నాటికి 100ఏళ్లు పూర్తి కానుంది. ఈ వార్షికోత్సవం సందర్భంగా అద్భుత ప్రదర్శన ఇవ్వడానికి సీఎంసీ, సీపీసీ ఆదేశాలను పీఎల్‌ఏ తప్పనిసరిగా అమలు చేయాలని జిన్​పింగ్​ అన్నారు.

మరిన్ని అధికారాలు..

ప్రపంచంలో అతిపెద్ద సైనిక వ్యవస్థ కలిగిన చైనాలో అధ్యక్ష బాధ్యతలతోపాటు అక్కడి సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌(సీఎంసీ) బాధ్యతలు అధ్యక్షుడి చేతుల్లోనే ఉన్నాయి. అయితే, తాజాగా అక్కడి సైనిక అధికారాలను విస్తరించే చట్టాన్ని సవరించడంతో అధ్యక్షుడికి మరిన్ని అధికారాలు వచ్చాయి. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఆలోచనలకు అనుగుణంగా చైనా లక్షణాలు కలిగిన సోషలిజం భావాలను సైన్యం అలవరచుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రస్తుతం ఉన్న సైనిక శిక్షణా విధానాన్ని సంస్కరించడంపై దృష్టి సారించడంతో పాటు సాయుధ దళాలు ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండే విధంగా తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని పిలుపునిచ్చింది. తాజాగా సైనిక శిక్షణా శిబిరం ప్రారంభం నేపథ్యంలో షీ జిన్‌పింగ్‌ సైనికులకు పలు సూచనలు చేశారు.

ఇదీ చూడండి: చైనాలో ఓ సంస్థ మాజీ అధినేతకు మరణశిక్ష

Last Updated : Jan 5, 2021, 9:50 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.