ETV Bharat / international

'ఇంకెప్పుడూ బుద్ధి తక్కువ మాటలు చెప్పను' - పాక్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వార్తలు

అత్యాచారం వ్యవహారంలో ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వెనక్కి తగ్గారు. 'అత్యాచారానికి పాల్పడిన వ్యక్తే పూర్తిగా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని.. స్త్రీ ఎంత రెచ్చగొట్టినా, ఎలాంటి దుస్తులు ధరించినా.. చివరికి ఆమే బాధితురాలు అవుతుంది కాబట్టి, బాధితురాలు ఎప్పుడూ బాధ్యురాలు కాదని' స్పష్టం చేశారు. ఇంతకుముందులా మరెప్పుడూ బుద్ధి తక్కువ వ్యాఖ్యలు చేయనన్నారు.

Imran Khan
ఇమ్రాన్‌ ఖాన్‌
author img

By

Published : Jul 29, 2021, 7:21 AM IST

అత్యాచారం, మహిళలపై లైంగిక వేధింపుల విషయమై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల విషయంలో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వెనక్కి తగ్గారు. దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువ కావడంపై గత నెల ఆయన మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజంలోని ప్రలోభాలకు దూరంగా ఉండటం ద్వారా మహిళలపై లైంగిక వేధింపులను తగ్గించవచ్చన్నారు. మహిళలు ఆకర్షించే, రెచ్చగొట్టే ధోరణుల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయన్న అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటం తీవ్ర దుమారం రేపాయి. అంతకుముందు కూడా ఈ అంశంపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ క్రమంలోనే అమెరికా మీడియా సంస్థ పీఎస్‌బీ న్యూస్‌ అవర్‌తో ఖాన్‌ తాజాగా మాట్లాడారు. మునుపటి తన వ్యాఖ్యల విషయంలో వెనక్కు తగ్గారు.

"అత్యాచారానికి పాల్పడిన వ్యక్తే పూర్తిగా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. స్త్రీ ఎంత రెచ్చగొట్టినా, ఎలాంటి దుస్తులు ధరించినా.. చివరికి ఆమే బాధితురాలు అవుతుంది. కాబట్టి, బాధితురాలు ఎప్పుడూ బాధ్యురాలు కాదు. ఇంతకుముందులా మరెప్పుడూ బుద్ధి తక్కువ వ్యాఖ్యలు చేయను. గత ఇంటర్వ్యూల్లో నేను ఏం మాట్లాడానన్నది బాగా గుర్తుంది. ఎప్పుడైనా అత్యాచారానికి పాల్పడిన వ్యక్తే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నా. మహిళలకు ఇస్లాం గౌరవ మర్యాదలు ఇస్తుంది"

-- ఇమ్రాన్‌ ఖాన్, పాక్ ప్రధాని

పాకిస్థాన్‌లో గత ఆరేళ్లలో 22 వేల అత్యాచార కేసులు నమోదయ్యాయి.

రోజూ 11 అత్యాచారాలు!

అధికారిక గణాంకాల ప్రకారం- పాకిస్థాన్‌లో రోజూ సగటున 11 అత్యాచార సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) విడుదలచేసిన 'గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ రిపోర్టు-2021' ప్రకారం..

లింగ సమానత్వం అత్యంత తక్కువగా ఉన్న దేశాల జాబితాలో పాకిస్థాన్‌ ఏడాదిలో కాలంలోనే రెండు ర్యాంకులు దిగువకు పడిపోయింది.ప్రస్తుతం ఈ జాబితాలోని అట్టడుగు నాలుగు దేశాల్లో ఒకటిగా ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్‌ పేర్కొంది.

ఇదీ చదవండి: ప్రధానిని ఇబ్బంది పెట్టిన గొడుగు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.