ETV Bharat / international

ప్రపంచంలోనే అతిపెద్ద ఆలుగడ్డ- బరువు 8 కిలోలు! - 7.9 కేజీల ఆలుగడ్డ

ఆలుగడ్డలు మహా అంటే ఎంత బరువుంటాయి? 150-200 గ్రాములు... అంతే కదా..! కానీ ఓ ఇంటి పెరట్లో పెరిగిన ఆలూ మాత్రం ఏకంగా 8 కిలోల (Worlds Biggest Potato) బరువు ఉంది.

worlds biggest potato
ప్రపంచంలోనే అతిపెద్ద ఆలుగడ్డ!
author img

By

Published : Nov 4, 2021, 3:24 PM IST

Updated : Nov 4, 2021, 4:19 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద ఆలుగడ్డ- బరువు 8 కిలోలు!

ప్రపంచంలోనే అతిపెద్ద (Worlds Biggest Potato) ఆలుగడ్డ న్యూజిలాండ్​లో బయటపడింది. హామిల్టన్​లో ఉండే కొలిన్, డొన్నా క్రెయిగ్-బ్రౌన్ గార్డెన్​లో ఏకంగా 7.9 కేజీల ఆలుగడ్డ పెరిగింది. గార్డెనింగ్ సమయంలో ఇది వారి కంట పడింది. తొలుత దాన్ని ఏదో ఫంగస్ అని భావించారు. పూర్తిగా తవ్వి తీసి రుచి చూసిన తర్వాతే అది ఆలుగడ్డ (Largest Potato in the World) అని నిర్ధరణకు వచ్చారు.

worlds biggest potato
ఆలుగడ్డను చేతిలో పట్టుకున్న కొలిన్..

ప్రపంచంలో ఇప్పటివరకు పెరిగిన అతిపెద్ద ఆలూ (World's biggest potato) ఇదేనని తెలుస్తోంది. బ్రిటన్​లో 2011లో బయటపడిన ఆలుగడ్డ.. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్దదిగా (World's largest potato) గిన్నీస్ రికార్డుకెక్కింది. దాని బరువు 5 కేజీలు.

worlds biggest potato
ఓ ట్రాలీపై ఆలుగడ్డ
worlds biggest potato
.

ముద్దుగా డగ్ అని..

ఆగస్టు 30న ఇది బయటపడగా.. దీనికి చుట్టుపక్కల వారు తెగ ఫ్యాన్స్ అయిపోయారు. ఆ ఆలుగడ్డ ఫొటోలను ఫేస్​బుక్​లో అప్​లోడ్ చేసిన తర్వాత.. దీనికి మరింత పాపులారిటీ వచ్చింది. కొలిన్ దంపతులు ఈ ఆలుగడ్డను 'డగ్' అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఈ ఆలుగడ్డ వివరాలను గిన్నిస్ సంస్థకు పంపించారు. వారి నుంచి స్పందన రావాల్సి ఉంది.

worlds biggest potato
ఆలుగడ్డను బొమ్మ ట్రాలీలో పెట్టి తరలిస్తూ...

అలా పెరిగింది...

దీన్ని కొలిన్ సొంతంగా పెంచలేదు. తాను దోసకాయలను మాత్రమే పెంచానని, ఈ ఆలుగడ్డ తనంతట తానుగా పెరిగిందని చెబుతున్నారు. రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ రోజుల నుంచే ఇది పెరుగుతూ ఉండొచ్చని అన్నారు.

worlds biggest potato
ప్రపంచంలోనే అతిపెద్ద ఆలుగడ్డ!

ఇదీ చదవండి: వెయ్యి కిలోల గుమ్మడికాయ.. చూశారా ఎప్పుడైనా?

Last Updated : Nov 4, 2021, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.