ETV Bharat / international

ఆకలి సంక్షోభంలో మయన్మార్​!

రానున్న ఆరు నెలల్లో మయన్మార్​లో ఆకలి సంక్షోభం రెట్టింపు అవుతుందని అమెరికాకు చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్ల్యూఎఫ్​పీ) హెచ్చరించింది. కొవిడ్​ ప్రభావం, నిరుద్యోగం, రాజకీయ సమస్యల కారణంగా ఆకలి సమస్యలు తీవ్రమవుతున్నట్లు తెలిపింది.

wfp, myanmar
డబ్ల్యూఎఫ్​పీ, మయన్మార్
author img

By

Published : Aug 7, 2021, 10:57 AM IST

మయన్మార్​లో కొవిడ్​ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆకలి సంక్షోభం సమస్య తలెత్తుతోందని అమెరికాకు చెందిన వరల్డ్​ ఫుడ్​ ప్రోగ్రామ్(WFP) వెల్లడించింది. నిరుద్యోగం, ఆహార, చమురు ధరల పెంపు, రాజకీయ అశాంతి, హింస మొదలైనవి ఆహార సమస్యకు కారణమవుతున్నాయని హెచ్చరించింది.

" నిధుల కొరత వల్ల మయన్మార్​లో.. పలు భవిష్యత్తు కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఫలితంగా వచ్చే ఆరు నెలల్లో ఆకలి సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య రెట్టింపు అవుతుంది. దాదాపు 6.2 మిలియన్ల మంది ఆహార సమస్య ఊబిలో చిక్కుకోనున్నారు" అని డబ్ల్యూఎఫ్​పీ హెచ్చరించింది.

ఇప్పటికే మయన్మార్​లో ఆకలి సమస్య తీవ్రమైందని డబ్ల్యూఎఫ్​పీ మయన్మార్​ డైరెక్టర్ స్టీఫెన్ అండర్సన్​ తెలిపారు. యాంగూన్​ సమీపంలోని మురికివాడల్లో నివసిస్తున్న 90 శాతం మంది ఆహారం కోసం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఆదాయం లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నట్లు స్పష్టం చేశారు.

"మయన్మార్​ సైనిక ప్రభుత్వ హింసకాండకు భయపడి దాదాపు 2,20,000 మంది పారిపోయారు. అనంతరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో 17,500 మందికి డబ్ల్యూఎఫ్​పీ సాయం చేసింది. ఆగస్టులో మరింత మందికి సాయం అందించేందుకు ప్రణాళిక రచిస్తోంది. మొత్తంగా 2021లో.. 1.25 మిలియన్ల మందికి డబ్ల్బూఎఫ్​పీ ఆహారం, నిధి సహాయం అందింది" అని అమెరికా సంస్థ పేర్కొంది.

ఇదీ చదవండి:'మరో రెండేళ్ల పాటు నేనే ప్రధాని'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.