ETV Bharat / international

New Year 2022: ఒమిక్రాన్​ భయాల మధ్యే ఘనంగా వేడుకలు - జపాన్​లో న్యూఇయర్

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొన్న ప్రజలు.. 2021కి వీడ్కొలు చెబుతూ కొత్త ఏడాదికి ఆనందోత్సాహాల మధ్య ఆహ్వానం పలికారు. బాణాసంచా వెలుగు జిలుగులు, మిరుమిట్లు గొలిపే విద్యుత్‌దీపకాంతుల వెలుగులు వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

new year celebrations
న్యూఇయర్​ వేడుకలు
author img

By

Published : Jan 1, 2022, 4:08 AM IST

New Year 2022: నూతన సంవత్సర వేడుకలను ప్రపంచ దేశాలు ఘనంగా జరుపుకున్నాయి. కళ్లుచెదిరే లైటింగ్, బాణసంచా మధ్య దుబాయ్​ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. ఇందుకు ప్రపంచంలో ఎత్తైన భవనం బుర్జ్​ ఖలీఫా వేదికైంది.

new year 2022
వెలుగులు విరజిమ్ముతున్న బుర్జ్​ ఖలీఫా

ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రపంచ ప్రఖ్యాత సిడ్నీహార్బర్ వద్ద జరిగిన వేడుకలకు భారీగా తరలివచ్చిన ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటుచేసిన సంగీతానికి తోడు బాణసంచా మోతలతో సిడ్నీ నగరం మారుమోగింది.

new year 2022
ఆస్ట్రేలియాలో బాణసంచా

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న రష్యాలో కూడా నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మాస్కోలోని రెడ్​ స్క్వేర్​ జనంతో కిక్కరిసింది. బాణసంచాతో ప్రజలు కొత్త ఏడాదికి స్వాగతం పలికారు.

new year 2022
రష్యాలో న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​
new year 2022
రష్యాలో నూతన సంవత్సర వేడుకలు

ఉత్తర కొరియాలో.. కొత్త ఏడాది వేడుకలు ఘనంగా జరిగాయి. కిమ్ జోంగ్ ఉన్ అధికారం చేపట్టి పదేళ్లు పూర్తి కావటం వల్ల పెద్దఎత్తున వేడుకలు నిర్వహించారు. రాజధాని పాంగ్ యాంగ్‌లోని కిమ్-II సంగ్ స్క్వేర్ వద్ద జరిగిన వేడుకల్లో ప్రజలు మాస్క్​లు ధరించి పెద్దసంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు. అ ప్రాంతమంతా రంగురంగుల లేజర్ లైటింగ్‌, బాణసంచా మోతలతో దద్ధరిల్లింది.

హాంగ్‌కాంగ్‌లోనూ నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో బాణసంచా వెలుగు జిలుగులు లైటింగ్ షో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విక్టోరియా హార్బర్ వద్ద ఏర్పాటు చేసిన యానిమేటెడ్ స్క్రీన్లపై ప్రదర్శించిన 2022..., వివిధ భాషల్లో హ్యాపీ న్యూ ఇయర్ చూపరులను ఆకట్టుకున్నాయి.

new year 2022
హాంకాంగ్​లో నూతన సంవత్సర వేడుకలు
new year 2022
హాంకాంగ్​లో నూతన సంవత్సర వేడుకలు

తైవాన్‌లో కొత్త సంవత్సర వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. రాజధాని తైపీలోని 101 అంతస్థుల ఆకాశహార్మ్యం వద్ద వేడుకలు నిర్వహించారు.భవనంపై ఏర్పాటు చేసిన లైటింగ్ షో హైలెట్‌గా నిలిచింది.

new year 2022
తైవాన్​లో ఘనంగా వేడుకలు

జపాన్​లో ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రోడ్లు అన్ని కిక్కిరిశాయి. ప్రార్ధనలతో ప్రజలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.

new year 2022
జపాన్​లో నూతన సంవత్సర వేడుకలు

ఇదీ చూడండి : కన్నుల పండువగా ఆస్ట్రేలియాలో నూతన సంవత్సర వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.