ఆస్ట్రేలియా సిడ్నీలో 21 ఏళ్ల యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. నగరంలోని రద్దీ ప్రాంతమైన యార్క్ స్ట్రీట్లో ప్రయాణికులపై కూరగాయల కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. పలువురికి గాయాలయ్యాయి.
నిందితుడిగా అనుమానిస్తున్న మెర్ట్ నీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెర్ట్ గతంలో మానసిక సమస్యలతో బాధపడినట్లు తెలిపారు.
రెండు నేరాలు ఇతడివేనా?
రోడ్డుపై వెళుతుండగా ఓ కారుపై నుంచి దూకి 41 ఏళ్ల మహిళను పొడిచాడు. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. కాసేపటికి 21 ఏళ్ల మరో మహిళ చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి ఈ రెండు నేరాల్లోనూ మెర్ట్ను అనుమానితుడిగా భావిస్తున్నామని తెలిపారు.
ఉగ్రకోణం..!
దాడి సమయంలో నిందితుడు చేసిన నినాదాల వెనుక ఏదైనా ఉగ్రకోణం ఉందేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడికి ఎలాంటి తీవ్రవాద నేపథ్యం లేదనీ, ఫలితంగా దాడిలో ఉగ్రకోణం ఉండకపోవచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. అయితే దర్యాప్తు జరుగుతోందని, ఈ విషయంపై మళ్లీ స్పందిస్తామన్నారు.
ఇదీ చూడండి: వైరల్: మన్యం పులి వర్సెస్ పార్క్ పులి!