శ్రీలంక సైన్యానికి శిరు విజెమన్నె అనే అధ్యాపకురాలు ఐదు జర్మన్ షెపర్డ్ శునకాలను బహుమతిగా అందించారు. పేలుడు పదార్థాల గుర్తింపునకు ఈ శునకాలను వినియోగించనున్నట్లు సైన్యం స్పష్టం చేసింది.
ఓ అంతర్జాతీయ ఓపెన్ యూనివర్సిటీ అధ్యాపకురాలు శిరు విజెమన్నె అందించిన ఈ శునకాలన్నీ ఒక కుటుంబానికి చెందినవే. వీటిలో 3 శునకాలకు వయసు మూడేళ్లు. మరో రెండింటికి రెండేళ్లు నిండాయి.
మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాల అన్వేషణలో సైన్యం చర్యలు తనకు ఎంతో నచ్చాయని, అందుకే శునకాలను బహుమతిగా ఇచ్చినట్టు షిరు విజెమన్నె తెలిపారు.
ఈ నెల 21న శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లలో 253 మంది మృతి చెందారు. 500మందికి పైగా గాయపడ్డారు.
ఇదీ చూడండి: భాజపాను బలపరిచిన శునకం.. అరెస్టు