ETV Bharat / international

'ఐసిస్' ఓడినా.. నెట్టింట మాత్రం సూపర్​ స్ట్రాంగ్! అడ్డుకునేదెలా? - isis social media case

ఐసిస్ ఓడినా.. దాని భావజాలం ఓడిపోవడం లేదు. లెక్కకు మించి పౌరులను తన చెరలో బందీ చేస్తోంది. పంథా మార్చి ఆన్​లైన్​లో(ISIS online threat) తెగబడుతోంది. పెద్ద ఉగ్ర సంస్థల మద్దతు లేకుండానే.. దాని భావజాలానికి(isis ideology) ఆకర్షితులైన వారు స్వయంగా దాడులకు తెగబడుతున్నారు. మరి, ఈ దాడులను(terror attacks) అరికట్టేదెలా? ఆన్​లైన్ ఉగ్రవాదానికి అడ్డుకట్ట సాధ్యం కాదా?.. ఓసారి పరిశీలిస్తే..

online terrorism
ఆన్​లైన్ ఉగ్రవాదం
author img

By

Published : Sep 5, 2021, 12:00 PM IST

ఐసిస్ సానుభూతిపరుడు న్యూజిలాండ్​లోని ఓ సూపర్​మార్కెట్​లో శుక్రవారం(New Zealand supermarket attack) దాడికి తెగబడ్డాడు. కత్తులతో విరుచుకుపడి ఆరుగురిని గాయపరిచాడు. అప్రమత్తమైన పోలీసులు.. అతడిని మట్టుబెట్టారు. అయితే, ఈ దాడికి వెనక ప్రత్యక్షంగా ఐసిస్(ISIS) హస్తమేమీ లేదు. దాని భావజాలాన్ని(isis ideology) ఒంటపట్టించుకున్న దుండగులే ఇలాంటి ఘటనలకు తెగబడుతున్నారు. ఇటీవల ఇలాంటి దాడులు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో.. పశ్చిమ దేశాల్లో అసంతృప్తితో జీవనం సాగిస్తున్న కొందరిలో ఐసిస్ భావజాలం పూర్తిగా తొలగిపోలేదని స్పష్టమవుతోంది.

సామాజిక మాధ్యమాలతో...

ఐసిస్​ను ఓడించినా.. దాని భావజాలం మాత్రం సిరియా, ఇరాక్​లో(isis in iraq) ఇంకా అలాగే ఉంది. ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలన్న ఆశయం, ప్రణాళికలూ కొనసాగుతున్నాయి. పశ్చిమ దేశాల విధానాలపై వ్యతిరేకత వ్యక్తం చేసేవారిని గుర్తించి వారికి తమ బుట్టలో వేసుకుంటోంది ఐసిస్. ఇందుకోసం సామాజిక మాధ్యమాలను(isis social media) విరివిగా ఉపయోగించుకుంటోంది. వీటికి తోడు ఇతరుల కంట పడకుండా తమ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు డార్క్​వెబ్​లు, ఎన్​క్రిప్టెడ్ ప్లాట్​ఫాంలు.. వారికి ఉపయుక్తంగా మారుతున్నాయి.

దీంతో ఆన్​లైన్ టెర్రరిజంపై(online terrorism) ఇప్పుడు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్లు, కంప్యూటర్ల ద్వారానే ఉగ్ర భావజాలం గురించి తెలుసుకుంటున్నారు. ఐసిస్ వంటి ఉగ్ర సంస్థల నుంచి ఎలాంటి సహాయం లేకుండానే.. సొంతంగా దాడులకు తెగబడుతున్నారు. అయితే, ఆన్​లైన్​లో(online isis) ఇలాంటి కంటెంట్​ను వ్యాప్తి చేస్తూ తమ విషపూరిత అజెండాను(isis agenda) కొనసాగిస్తోంది మాత్రం ఐసిస్ వంటి పెద్ద ముఠాలే.

ఐసిస్​ను ఓడించడం ఎందుకంత కష్టం?

ఉగ్రవాదాన్ని ఓడించడమంటే(tackling terrorism).. పూర్తిగా దాన్ని నామరూపాలు లేకుండా చేయడమే! ఈ ప్రకారం చూసుకుంటే ఐసిస్ ఎప్పుడూ(isis defeat) ఓడిపోలేదు. ఇరాక్, సిరియాలో ఐసిస్​ సైనికంగా ఓటమి చవి చూసినప్పటికీ.. చెల్లాచెదురైన ఈ సంస్థ విభాగాలు ఇతర దేశాల్లో వేళ్లూనుకున్నాయి. అఫ్గానిస్థాన్​కూ(isis in afghanistan) ఇవి వ్యాపించాయి. తాలిబన్లు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. అఫ్గాన్ నుంచి ఉగ్రవాదం పేట్రేగిపోతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి.. తాలిబన్, ఐసిస్ మిత్ర సంస్థలేం(isis taliban relationship) కాదు. వీరి మధ్య పోరు నడుస్తోందని చెప్పేందుకు తాజా కాబుల్ విమానాశ్రయ(kabul airport attack) ఘటనే ప్రత్యక్ష ఉదహరణ. ఆత్మాహుతి దాడులకు ఐసిస్ ప్రయత్నిస్తుంటే.. వారిని అడ్డుకునేందుకు తాలిబన్లు పని చేశారు.

కానీ, అఫ్గానిస్థాన్​లో అమెరికా దళాలను తాలిబన్లు ఓడించడం(taliban defeated us) ఐసిస్​కు సానుకూలాంశమే. ఇది.. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంపొందించేలా వారికి మరింత ప్రోత్సాహం ఇస్తుంది. ప్రపంచంలో ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య ఘర్షణ జరుగుతోందని భావించే ఐసిస్​కు.. తమ భావజాలాన్ని మరింత విస్తరింపజేసేందుకు ఈ ఘటన ఉపయోగపడుతుంది.

ప్రపంచ స్థాయి చర్యలు..

ఆన్​లైన్ ఉగ్రవాదులకు అడ్డుకట్ట(online terrorism) వేసేందుకు న్యూజిలాండ్ ప్రపంచ స్థాయి చర్యలు ఇప్పటికే ప్రారంభించింది. ఆన్​లైన్ టెర్రరిజాన్ని అంతమొందించేందుకు ఉద్దేశించిన 'క్రైస్ట్​చర్చ్' శిఖరాగ్ర(christchurch call to action) సదస్సును నిర్వహించి.. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదని చాటి చెప్పింది.

ఈ చర్యలు కొంతవరకు సఫలీకృతమయ్యాయి. 'గ్లోబల్ ఇంటర్నెట్ ఫోరం టు కౌంటర్ టెర్రరిజం' సంస్థను సంస్కరించే దిశగా అడుగులు పడ్డాయి. ఆన్​లైన్ మాధ్యమాల ద్వారా ఉగ్రవాదులు(terrorism attacks use internet) దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తే.. వాటిని గుర్తించి అడ్డుకునే ప్రోటోకాల్​ రూపొందించారు. ప్రజల భాగస్వామ్యంతో ఆన్​లైన్ ఉగ్రవాదాన్ని అరికట్టేలా చర్యలు చేపట్టారు.

ముష్కరుల కొత్త పోకడలు!

అయితే, ఆన్​లైన్​ మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు కొత్త అల్గారిథంలు వస్తున్నాయి. విభిన్న మార్గాల్లో యూజర్లను చేరుకునేలా ముష్కరులు పన్నాగాలు పన్నుతున్నారు. వీటిని అరికట్టేందుకు 'ఎథికల్ అల్గారిథం' అభివృద్ధి చేయాలని న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్(jacinda ardern) నిపుణులకు పిలుపునిచ్చారు. సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు నిర్వహించనున్న బుడాపెస్ట్ కన్వెన్షన్​(budapest convention on cybercrime)లో భాగమవుతామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా దేశంలోనూ ఈ దిశగా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. ఉగ్రవాద వ్యతిరేక విధానాలను రూపొందించేందుకు నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్​లెన్స్​ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్డెర్న్ ప్రకటించారు.

దాడులు అడ్డుకోవడం ఎందుకు కష్టం?

న్యూజిలాండ్​ సూపర్​మార్కెట్(NZ supermarket stabbing) దాడికి పాల్పడిన వ్యక్తి... శ్రీలంక జాతీయుడు. గతంలో.. ఈ నిందితుడు ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఐసిస్ కంటెంట్ లభించింది. దీన్ని గుర్తించి సామాజిక మాధ్యామాలు వినియోగించకుండా అతడిపై పోలీసులు నిషేధం విధించారు. 2017 నుంచే ఈ అనుమానితుడిపై నిఘా వేశారు. ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడు అవుతున్నాడని.. అతడి ప్రతి కదలికనూ గమనించేవారు. శుక్రవారం ప్రజలపై కత్తితో దాడి చేస్తున్న సమయంలోనూ పోలీసులు అతడి సమీపంలోనే ఉన్నారు. కాబట్టే.. దాడి చేసిన నిమిషం లోపు నిందితుడిని కాల్చి చంపేశారు.

ఇలా అనుమానితులపై నిరంతరం నిఘా ఉంచడం ద్వారా ఉగ్ర ఘటనలకు(surveillance on terrorism) అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. అయితే, ఇక్కడే అసలు సమస్య వస్తుంది. అనుమానితుల సంఖ్య వందల్లో ఉన్న న్యూజిలాండ్​లోనే.. దుండగులపై 24 గంటలు నిఘా వేయడం కష్టతరమవుతోంది. అలాంటిది పెద్ద దేశాల్లో ఇది సాధ్యమవుతుందా అనేది ప్రశ్నార్థకం. ఇక నిధుల సమస్య ఉండనే ఉంది. అత్యాధునిక సాంకేతికత అంటే ఖర్చుతో కూడుకున్న పని. ఈ పరిజ్ఞానాన్ని వినియోగించడం చాలా దేశాలకు తలకు మించిన భారమే.

అనుమానితులపై నిఘా వేసినా.. వారు ఎప్పుడు దాడులకు తెగబడతారనే విషయం చెప్పలేం. వీరంతా పై నుంచి వచ్చే ఆదేశాలతో కాకుండా.. వారి ఆలోచనల ప్రకారమే నడుచుకుంటారు. కాబట్టి ఇలాంటి దాడులు ఆపడం కష్టమవుతోంది.

ఎలక్ట్రానిక్ డివైజ్​లు, ఇంటర్నెట్ ప్లాట్​ఫాంలన్నింటిపై అనుచిత నిఘా వేయడం ఓ మార్గం. అయితే, దేశంలోని ప్రజలంతా తమను టార్గెట్ చేస్తున్నారన్న భావనలో ఉంటారు. న్యూజిలాండ్ వంటి ప్రజాస్వామ్య దేశాలు ఇలాంటివి ఉపయోగించేందుకు సుముఖత చూపవు.

పరిష్కారం ఇదే!

ఈ తరహా ఉగ్రదాడులను అరికట్టేందుకు ఉత్తమమైన మార్గం ఒకటి ఉంది. అదే సామాజిక సమైఖ్యత. క్షేత్రస్థాయిలో ప్రజలంతా ఇలాంటి భావజాలానికి వ్యతిరేకంగా ఉండాలి. క్రైస్ట్ చర్చ్ దాడుల(christchurch terrorist attack) తర్వాత న్యూజిలాండ్ ముస్లిం సమాజం వీటిని తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ ప్రపంచదేశాలను నడిపిస్తూ పరిష్కారం దిశగా అడుగులు వేసింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.