ETV Bharat / international

ఆ మహిళ దెబ్బకు పాక్‌ నేతలు గజగజ..! - pakisthan political updates

పాకిస్థాన్​లో ఓ మహిళ పేరు ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్కడి అగ్రనేతల రాజకీయ భవిష్యత్తుకు సమాధి కడుతోంది. పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ అగ్రనేత బిలావల్‌ భుట్టో రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. అమెరికాకు చెందిన ఆ యువతికి అసలు పాక్​తో సంబంధమేంటి?

Why Cynthia D Ritchie has the militarys ear
ఆమె దెబ్బకు పాక్‌నేతలు గజగజ..!
author img

By

Published : Jun 11, 2020, 7:37 PM IST

'సింతియా డాన్‌ రీచి'.. ప్రస్తుతం కరోనా వైరస్‌ను మించి ఈ మహిళ పేరు పాకిస్థాన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్కడి అగ్రనేతల తెర వెనుక వ్యవహారాలను ఒక్కొక్కటి వెలుగులోకి తెస్తూ కొందరి రాజకీయ భవిష్యత్తుకు సమాధి కడుతోంది. ప్రతిపక్షమైన పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ అగ్రనేత బిలావల్‌ భుట్టో రాజకీయ జీవితానికి ‘సింతియా’ ఎర్త్‌ పెడుతోంది.

ఎవరీ సింతియా..?

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన సింతియా డాన్‌ రిచి వివిధ రకాలపై ఒక షార్ట్‌ఫిల్మ్‌ మేకర్‌, యూట్యూబర్‌, ఎన్‌జీవోలో పనిచేస్తోంది. అంతేకాదు.. స్టార్టప్‌ కన్సల్టెంట్‌, కీలక నేతలకు అడ్వైజర్‌ ఇలా పలు అవతరాల్లో దర్శనమిస్తుంది. పాకిస్థాన్‌ పవర్‌ కారిడార్‌లో ఆమెకు దాదాపు ఎదురులేదనే చెప్పాలి. ఉద్రిక్త సమయాల్లో కూడా పాకిస్థాన్‌ రహస్య సైనిక స్థావరాలకు, ప్రధాని నివాసానికి, అధ్యక్షుని బంగ్లాకు, మంత్రుల నివాసాలకు వెళ్ళగలిగే చొరవ ఉంది.

మంత్రి అత్యాచారం చేశాడు..

  • పాకిస్థానీ పీపుల్స్‌ పార్టీకి చెందిన కీలక నేతలపై ఆమె తీవ్రమైన ఆరోపణలు చేసింది. "మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో తన భర్త ఆసీఫ్‌ అలీ జర్దారీతో సంబంధాలు పెట్టుకొన్న మహిళలపై సెక్యూరిటీ గార్డులతో అత్యాచారాలు చేయించేది" అని వెల్లడించింది. పాకిస్థాన్‌లో ఓ పెద్ద కుటుంబంలో ఇటువంటి ఘటన జరిగినప్పుడు ఈ విషయాన్ని గుర్తుకు తెచ్చుకొంది. ఈ ట్వీట్‌ ఒక్కసారిగా కలకలం రేపింది. బిలావల్‌ భుట్టో వ్యక్తిగత జీవిత రహస్యాలను బయటకు వెల్లడించింది. దీంతో పీపీపీ పార్టీ ఆమెపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
  • 2011లో పాకిస్థాన్‌ ఇంటీరియర్‌ మంత్రి రెహ్మాన్‌ మాలిక్‌ తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపించింది. "నా వీసా కోసం నేను ఇంటీరియర్‌ మంత్రి బంగ్లాకు వెళ్లాను. అక్కడ నాకు పూలు, మత్తుపదార్థాలు కలిపిన పానీయం ఇచ్చారు. నేను ఈ విషయాన్ని అమెరికా దౌత్యకార్యాలయంలోని వారికి చెప్పాను. కానీ, ఇరుదేశాల సంబంధాలు దృష్ట్యా వారు పెద్దగా స్పందించలేదు" అని ట్వీట్‌ చేసింది.
  • మాజీ ప్రధాని యూసఫ్‌ రజా గిలానీ, నాటి ఆరోగ్య శాఖ మంత్రి ముఖ్దుం షాబుద్దీన్‌లు అధ్యక్ష భవనంలో తనతో అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొంది.
  • పాక్‌ నాయకులు యువతులతో కలిసి పార్టీలు చేసుకొంటున్న ఫొటోలను బయటపెట్టింది.

అమెరికా యువతికి పాక్‌లో పనేంటి..?

సింతియా డాన్‌ రిచీ టెక్సాస్‌లో చదువుకొనే సమయంలో పాక్‌కు చెందిన ఆజమ్‌ స్వాతి కూడా అక్కడే చదువుకొన్నారు. ఆ తర్వాత ఆయన పాక్‌ చట్టసభలో సభ్యుడయ్యాడు. 2009లో సింతియా టూరిస్ట్‌లా పాక్‌కు వచ్చింది. ఆ తర్వాత ఆజమ్‌ సాయంతో పాక్‌ సైన్స్‌ మినిస్టర్‌ ముఖ్దుం షాబుద్దీన్‌ వద్ద సహాయకురాలిగా చేరింది. అలా పాక్‌ పవర్‌ కారిడార్‌లోకి అడుగుపెట్టిన సింతియా మెల్లగా పట్టుపెంచుకొంటూ పోయింది.

పాక్‌ నిఘా సంస్థకు ప్రచారకర్తగా..

సింతియాకు నిధులు ఎలా వస్తాయో ఎవరికీ తెలియదు. తాను పాక్‌ను ప్రపంచానికి మంచిగా చూపించేలా యూట్యూబ్‌ వీడియోలు చేస్తానని చెబుతుంది. ఆమె పాక్‌ సైనిక ప్రచార విభాగమైన ఐఎస్‌పీఆర్‌కు పనిచేసింది. ఈ విభాగం డీజీగా ఆసీఫ్‌ గఫూర్‌ ఉన్న సమయంలో ఆమె చురుగ్గా పనిచేసింది. భారత్‌కు వ్యతిరేకంగా విషం చిమ్ముతుంది. పాక్‌ విదేశీయులను భారత్‌కు వ్యతిరేకంగా ఎలా వాడుకొంటారో సింతియా ఉదంతం తెలియజేస్తుంది. ఒక దశలో ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా సింతియాను తనతో గడపమని కోరిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది.

సింతియాపై ఆరోపణలు..

ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పీటీఐ పార్టీకి అనుకూలంగా సింతియా ఆరోపణలు చేస్తోందని పీపీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అమెరికాకు చెందిన సీఐఏ పాక్‌ పవర్‌ కారిడార్‌లోకి సింతియాను తీసుకొచ్చిందని ఆరోపిస్తున్నారు. వాస్తవాలేంటో కాలమే బయటపెట్టాలి. ఇక్కడో కొసమెరుపు ఉంది.

గతంలో కూడా జోవాన్‌ హెర్రింగ్‌ అనే మహిళను ఉపయోగించి సీఐఏ పాక్‌ నియంత జనరల్‌ జియావుల్‌ హక్‌ను నియంత్రించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమెను అమెరికాకు చెందిన చార్లివిల్సన్‌ అనే రాజకీయ నాయకుడు జియావుల్‌ హక్‌కు పరిచయం చేశాడు. సీఐఏ చరిత్రలో జరిగిన అతిపెద్ద కోవర్ట్‌ ఆపరేషన్‌గా దీనిని అభివర్ణిస్తారు. ఆమెది కూడా టెక్సాస్‌‌ కావడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.