ETV Bharat / international

డబ్ల్యూహెచ్​ఓ బృందం పర్యటనపై స్పందించిన చైనా

కరోనా మూలాల దర్యాప్తు అంశంలో డబ్ల్యూహెచ్​ఓ బృందం దర్యాప్తునకు చైనా అంగీకరించినా.. పర్యటనను ఖరారు చేయకుండా దాటవేత ధోరణిని అవలంబిస్తోందనే విమర్శలు వినిస్తున్నాయి. ఈ మేరకు చైనా ఉన్నతాధికారి శనివారం చేసిన ప్రకటన దీనికి మరింత బలం చేకూరుస్తోంది.

WHO experts to probe COVID-19 origin has no timeline
చైనాలో డబ్ల్యూహెచ్​ఓ బృందం పర్యటన కష్టమేనా??
author img

By

Published : Jan 9, 2021, 8:15 PM IST

కరోనా పుట్టుక, వైరస్​ మూలాలపై చైనాలోని వుహాన్​లో పర్యటించి.. దర్యాప్తు చేపట్టేందుకు చైనా అంగీకరించింది. ఈ మేరకు గత డిసెంబరులోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ)తో ఒప్పందానికి వచ్చింది. అయితే ఈ బృందం ఎప్పుడు పర్యటించాలనేది చెప్పకుండా డ్రాగన్​ దాటవేత ధోరణిని అవలంబిస్తోందనే విమర్శలు వినిస్తున్నాయి. ఈ మేరకు చైనా ఉన్నతాధికారి శనివారం చేసిన ప్రకటన దీనికి మరింత బలం చేకూరుస్తోంది.

ఆన్​లైన్​ ద్వారా?

నాలుగు దశల్లో జరగబోయే వీడియో కాన్ఫరెన్స్​ల్లో ఈ దర్యాప్తును చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు.. వీటికి చైనా- డబ్ల్యూహెచ్​ఓల మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టు చైనా అధికార పత్రిక గ్లోబల్​ టైమ్స్ వెల్లడించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి 'జెంగ్​ ఇగ్జిన్'​ మీడియాకు వెల్లడించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) బృందం చైనా పర్యటన.. వుహాన్​లో కరోనా మూలాలపై దర్యాప్తు వంటి అంశాలపై చర్చలు పురోగతిలో ఉన్నాయని చైనా జాతీయ వైద్య కమిషన్​ వెల్లడించింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్​ఓ ప్రతినిధుల కోసం తమ దేశ నిపుణులు ఎదురుచూస్తున్నట్టు జెంగ్ తెలిపారని గ్లోబల్​ టైమ్స్ ఉటంకించింది.

కరోనా మూలాల దర్యాప్తుపై మా వైఖరి స్పష్టంగా ఉంది. పూర్తి సహకారం అందించడానికి మేం సిద్ధం. ఇరు పక్షాల ఉమ్మడి సహకారంతో పారదర్శకంగా జరిగే దర్యాప్తు వైరస్​ మూలాలను అర్థం చేసుకునేందుకు, భవిష్యత్తులో మహమ్మారులను అరికట్టేందుకు తోడ్పడతాయి.

-జెంగ్ ఇగ్జిన్, చైనా ఆరోగ్య శాఖ డిప్యూటీ కార్యదర్శి

వుహాన్​ పర్యటనకు అంతర్జాతీయ బృందాన్ని అనుమతించకుండా ఆలస్యం చేస్తున్న చైనా తీరుపై టెడ్రోస్​ అథనోమ్​ ఇటీవలే అసహనం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: 'కరోనా మూలాలపై దర్యాప్తును రాజకీయం చేయొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.