పశ్చిమ ఆస్ట్రేలియాను ఆదివారం ప్రచండ తుపాను కుదిపేసింది. తీరంలో గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ఉద్ధృతమైన గాలులు వీచాయి. సుమారు 50 వేల ఇళ్లు, దుకాణాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
ఒక్క పెర్త్ నగరంలోనే 37 వేల ఇళ్లలో అంధకారం నెలకొంది. ఆస్ట్రేలియాలో సహజంగా నైరుతి దిశ నుంచి తుపానులు తీరాన్ని తాకుతుంటాయి. ప్రస్తుత తుపాన్ వాయవ్యం నుంచి వచ్చి బీభత్సం సృష్టించింది. దక్షిణ హిందూ మహాసముద్రంలోని మాంగా తుపాను ప్రభావం ఇందుకు జత కలిసింది.