కరోనా మహమ్మారిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్. "ప్రాణాంతక వైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పలేను. అందుకే కరోనాతో 6 నెలల నుంచి ఏడాది పాటు సహజీవనం చేసే పరిస్థితులు రావొచ్చు" అని అన్నారు ఇమ్రాన్. పాక్‌లో కొవిడ్-19 కేసులు తాజాగా 19వేలు దాటిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహమ్మారిపై జరుగుతున్న యుద్ధాన్ని బలంతో కాకుండా యుక్తితో గెలవొచ్చని అభిప్రాయపడ్డారు పాక్ ప్రధాని.
పాక్‌లో 19వేలు దాటిన కేసులు
పొరుగుదేశమైన పాకిస్థాన్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా అక్కడ మరో 989 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. వీరితో కలిపి పాక్‌లో ఇప్పటివరకు కొవిడ్-19 మొత్తం కేసులు 19,103కు చేరాయి. ఇందులో 440 మంది మరణించారు. 4,817 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. పాకిస్థాన్‌లో ప్రస్తుతం 13,846 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చూడండి : కరోనా భయాలు బేఖాతరు- పార్క్‌లు, బీచ్‌లలో జనం షికారు