ETV Bharat / international

'భారత్​-చైనా మధ్య మరొకరి జోక్యం అవసరం లేదు' - india china latest news

భారత్​-చైనా సరిహద్దు వివాదం ద్వైపాక్షిక అంశమని, ఇందులో మరొకరి జోక్యం అవసరం లేదని భారత్​లో చైనా రాయబారి సన్​ వీడాంగ్ అన్నారు. భారత్‌-చైనా సరిహద్దు వివాదం, హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛపై కీలకంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు.

we-dont-need-third-party-interference-needed-in-India-China-border-issue
'భారత్​-చైనా మధ్య మరొకరి జోక్యం అవసరం లేదు'
author img

By

Published : Jul 24, 2020, 10:35 PM IST

భారత్‌-చైనా సరిహద్దు వివాదం పరిష్కారానికి మరొకరి జోక్యం అవసరం లేదని భారత్‌లో చైనా రాయబారి సన్‌ వీడాంగ్‌ అన్నారు. ఇది ద్వైపాక్షిక అంశమని పేర్కొన్నారు. ప్రాంతంతో సంబంధం లేని శక్తుల ప్రవేశం వల్లే దక్షిణ చైనా సముద్రం వద్ద అసలైన సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన వరుస ట్వీట్లు చేశారు.

చైనా దుందుడుకు వైఖరి వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని భారత్‌లో బ్రిటన్‌ రాయబారి ఫిలిప్‌ బార్టన్‌ గురువారం అన్నారు. భారత్‌-చైనా సరిహద్దు వివాదం, హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛపై కీలకంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఇక్కడికి పోస్టింగ్‌ ఇచ్చాక తొలిసారి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారత విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబు ఇచ్చారు.

'బ్రిటిష్‌ హై కమిషనర్‌ చేసిన ఆరోపణలు అవాస్తవం. భారత్‌-చైనా సరిహద్దు వివాదం ద్వైపాక్షిక అంశం. విభేదాలను పరిష్కరించుకొనే సామర్థ్యం, విజ్ఞానం మాకున్నాయి. మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదు. ప్రాదేశిక ప్రాంతం, సముద్ర జలాల వివాదంలో సంబంధం లేని శక్తుల జోక్యంతోనే దక్షిణ చైనా సముద్రం వద్ద అసలైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇక హాంకాంగ్‌ వ్యవహారంలో విదేశీయుల జోక్యాన్ని చైనా అంగీకరించదు' అని సన్‌ వీడాంగ్ వరుస ట్వీట్లు చేశారు.

ఇదీ చూడండి: 'కరోనా కుట్ర'పై బిల్​గేట్స్​ కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.