ETV Bharat / international

Australia Submarine Deal: 'ఆస్ట్రేలియా ప్రధాని అబద్ధాలు చెప్పారు' - జలాంతర్గాముల కాంట్రాక్టు

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ తనతో అబద్ధమాడారని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్​ అన్నారు. ఫ్రాన్స్‌-ఆస్ట్రేలియా మధ్య జలాంతర్గాముల కాంట్రాక్టుకు (Australia Submarine Deal) సంబంధించిన విషయంపై మాట్లాడిన మేక్రాన్​ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై మారిసన్​ కూడా స్పందించారు. మేక్రాన్​ వ్యాఖ్యలు కేవలం తనని మాత్రమే అన్నట్లు కాదని. ఆస్ట్రేలియా మొత్తాన్ని అన్నట్లు ఉన్నాయని పేర్కొన్నారు.

Australia Submarine Deal
స్కాట్‌ మారిసన్‌, ఇమ్మానియేలు మాక్రోన్‌
author img

By

Published : Nov 3, 2021, 10:35 AM IST

ఫ్రాన్స్‌-ఆస్ట్రేలియా మధ్య జలాంతర్గాముల కాంట్రాక్టుకు (Australia Submarine Deal) సంబంధించిన వివాదం మరింత ముదిరింది. రోమ్‌లో జీ-20 భేటీ ముగిసిన తర్వాత ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ తనతో అబద్ధమాడారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్‌ మాత్రం ఈ వ్యాఖ్యలను తిరస్కరించారు. ' మేక్రాన్ వ్యాఖ్యలు కేవలం నన్ను అన్నట్లు కాకుండా.. ఆస్ట్రేలియా మొత్తాన్ని అన్నట్లు ఉన్నాయి. ఆ ఆరోపణలు ఎదుర్కోవడానికి నాకు తగినంత సత్తా ఉంది' అని మారిసన్‌ పేర్కొన్నారు. వేధింపులు, దూషణలను ఆస్ట్రేలియా ఏమాత్రం సహించదని పేర్కొన్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా-యూకే‌-అమెరికా కలిసి ఆకస్‌ రక్షణ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా, యూకేలు ఆస్ట్రేలియా అణు జలాంతర్గాలములు సమకూర్చుకొనేట్లు సహకరిస్తాయి. దీంతో అప్పటికే ఫ్రాన్స్‌ నుంచి 12 డీజిల్‌-ఎలక్ట్రిక్‌ జలాంతర్గాములు కొనుగోలు చేసేందుకు ఆస్ట్రేలియా ఒప్పందం చేసుకొంది. ఈ డీల్‌ విలువ 37 బిలియన్‌ డాలర్లు. కానీ, ఆకస్‌ డీల్‌ కారణంగా ఫ్రాన్స్‌-ఆస్ట్రేలియా ఒప్పందం రద్దైంది. దీంతో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకొంది. ఆస్ట్రేలియా వెన్నుపోటు పొడిచిందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్ వ్యాఖ్యానించారు. తాజాగా జీ20 సందర్భంగా మేక్రాన్ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి.

ఇదీ చూడండి: 'మాకు వీడియో లింక్​ పంపలేదు'.. కాప్​26 గైర్హాజరుపై చైనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.