స్పేస్ ఎక్స్ ద్వారా చంద్రుడిని చుట్టి రావడానికి ఎంపికైన తొలి ప్రైవేట్ వ్యక్తి యుసాకు మయిజావా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ జపాన్ బిలియనీర్.. తనకో గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ ఆన్లైన్లో ప్రకటన ఇచ్చారు. తనతో పాటు చంద్రయానం చేసేందుకు ఆ 'గర్ల్‌ఫ్రెండ్' సిద్ధంగా ఉండాలని దిగ్గజ వ్యాపారవేత్త స్పష్టం చేశారు.
జపాన్‌కు చెందిన ఓ నటితో విడిపోయినట్టు ఇటీవలే ప్రకటించారు యుసాకు. 44ఏళ్ల వయసులో ఒంటరితనం భరించలేకపోతున్నానని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
"నాకు ఇప్పుడు 44ఏళ్లు. ఒంటరితనం, ఏదో కోల్పోయిన భావనలు నన్ను వెంటాడుతున్నాయి. వీటిల్లో నేను కూరుకుపోకుండా ఉండాలంటే.. ఒక మహిళను ప్రేమించడం కొనసాగిస్తూ ఉండాలి."
--- యుసాకు మయిజావా, జపాన్ వ్యాపారవేత్త.
ఈ ప్రకటనతో పాటు.. 'చంద్రుడిపై ప్రయాణించే తొలి మహిళ మీరే ఎందుకు కాకూడదు?' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
-
[WANTED!!!]
— Yusaku Maezawa (MZ) 前澤友作 (@yousuck2020) January 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Why not be the ‘first woman’ to travel to the moon?#MZ_looking_for_love https://t.co/R5VEMXwggl pic.twitter.com/mK6fIJDeiv
">[WANTED!!!]
— Yusaku Maezawa (MZ) 前澤友作 (@yousuck2020) January 12, 2020
Why not be the ‘first woman’ to travel to the moon?#MZ_looking_for_love https://t.co/R5VEMXwggl pic.twitter.com/mK6fIJDeiv[WANTED!!!]
— Yusaku Maezawa (MZ) 前澤友作 (@yousuck2020) January 12, 2020
Why not be the ‘first woman’ to travel to the moon?#MZ_looking_for_love https://t.co/R5VEMXwggl pic.twitter.com/mK6fIJDeiv
ఇదీ ప్రక్రియ...
20ఏళ్లు పైబడి జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించే వారి కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు యుసాకు. ఆయనకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండాలనుకునే వారు ఈ నెల 17లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇదంతా ఆన్లైన్ ప్రక్రియ. అప్లై చేసుకున్న వారితో తరచూ డేట్స్‌కి వెళ్లి... మార్చి నెలాఖరులో తను ఇష్టపడ్డ గర్ల్‌ఫ్రెండ్‌ను ప్రకటిస్తారు యుసాకు. ఇదంతా ఓ టీవీషోగా రూపొందించనున్నారు.
ఆన్లైన్ ఫ్యాషన్ కంపెనీ జోజో మాజీ చీఫ్ యుసాకు.. గతేడాది తన సంస్థను యాహూకు అమ్మేసారు. యుసాకు ఇప్పటి వరకు ఇద్దరితో సహజీవనం చేశారు. ఆయనకు ముగ్గురు సంతానం. దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రైవేటు రోదసీ పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్.. 2023లో చంద్రుడి వద్దకు వాహకనౌకను పంపేందుకు సన్నద్ధమవుతోంది. ఈ యాత్రలో తనతోపాటు మరో ఆరుగురు కళాకారులను తీసుకెళ్లాలని యుసాకు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:- ఇచ్చట భార్య, పిల్లలు అద్దెకు ఇవ్వబడును!