వియత్నాం అరుదైన ఘనత సాధించింది. ఆసియాలోనే బాలికల హక్కులకు అధిక ప్రాధాన్యమిస్తున్న దేశాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మేరకు 'ద గర్ల్స్ లీడర్షిప్ ఇండెక్స్' పేరిట నివేదిక విడుదల చేసింది ప్లాన్ ఇంటర్నేషనల్.
రాజకీయాల్లో మహిళలను భాగస్వామ్యం చేయడంలో వియత్నాం.. అద్భుత పాత్ర పోషిస్తోందని 'ప్లాన్ ఇంటర్నేషనల్' నివేదిక పేర్కొంది. నవంబర్ 5న ఈ నివేదికను విడుదల చేసింది. మహిళలకు, బాలికలకు అవకాశాల్ని కల్పించే విషయంలో ఆసియాలో 19 దేశాలు, పసిఫిక్‌లో 14 దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పింది. విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు, రక్షణ, రాజకీయాల్లో భాగస్వామ్యం, చట్టాల అమలు అనే ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్లాన్ ఇంటర్నేషనల్ ఈ నివేదిక రూపొందించింది.
ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌తో పాటుగా మహిళల చట్టాలను సమర్థంగా అమలు చేస్తున్న దేశాల్లో వియత్నాం రెండో స్థానంలో నిలించిందని నివేదిక పేర్కొంది. రాజకీయ అవకాశాలను అధికంగా కల్పించడంలో సింగపూర్ తర్వాత రెండో స్థానంలో ఉందని చెప్పింది. 2020తో పోల్చితే ఆరోగ్యం, విద్య విషయంలో కూడా వియత్నాం మెరుగైన ఫలితాలు సాధించిందని వెల్లడించింది .
ఇదీ చూడండి: రోగుల పాలిట సంజీవని.. కేరాఫ్ '5జీ ఆసుపత్రి'