ETV Bharat / international

కొవిడ్‌ కోరలు వంచిన జపాన్.. ఇవే కారణాలు - జపాన్​ కరోనా వైరస్​ను ఎలా కట్టడి చేయగలిగింది?

జపాన్​లో వెలుగుచూసిన కరోనా కేసుల ధాటికి.. టోక్యో ఒలింపిక్స్​ నిర్వహణ సైతం కష్టమని భావించారంతా. కానీ.. ప్రస్తుతం అక్కడ కరోనా ఆనవాళ్లు లేనంతగా పరిస్థితి మారిపోయింది. అతి తక్కువ సమయంలో కేసులను భారీగా ఎలా తగ్గాయి? జపాన్ ప్రభుత్వం పాటించిన చర్యలేంటి మీరు తెలుసుకోండి..

japan virus success
జపాన్
author img

By

Published : Oct 19, 2021, 5:38 AM IST

కరోనా.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి.. కొత్త కొత్త వేరియంట్లతో మానవాళికి ఎప్పటికప్పుడు సవాల్‌ విసురుతోన్న విషయం తెలిసిందే! కొత్త కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. రష్యాలో అయితే భారీ ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాలు పౌరులపై ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే.. జపాన్‌లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ బార్లు నిండిపోతున్నాయి.. రైళ్లు కిటకిటలాడుతున్నాయి.. అసలు ఇక్కడ కరోనా ఉందా అని అనుమానం వచ్చేలా ఎటుచూసినా సందడి వాతావరణం కనిపిస్తోంది. పోనీ.. తక్కువ టెస్టుల కారణంగా కేసులు బయటకు రావడం లేదా అనుకుంటే.. అధికారిక గణాంకాల ప్రకారం ఆగస్టు నెలాఖరులో 25 శాతంగా ఉన్న పాజిటివిటి రేటు అక్టోబర్ మధ్యనాటికి ఒక శాతానికి పడిపోవడం గమనార్హం. ఇంత తక్కువ సమయంలోనే పరిస్థితులు ఎలా అదుపులోకి వచ్చాయా అని ఇతర దేశాలు ఆశ్చర్యపోతున్నాయి!

ఆగస్టులో ఆరు వేలు.. ఇప్పుడు 40 మాత్రమే..

జపాన్‌.. ప్రస్తుతం అతి తక్కువ సమయంలో కరోనాపై విజయం సాధించిన దేశంగా నిలిచింది. జులైలో ఒలింపిక్స్‌కు ముందు ఇక్కడ భారీ ఎత్తున కేసులు వచ్చాయి. ఆగస్టు మధ్యలోనూ టోక్యోలో రోజువారీగా దాదాపు ఆరు వేల కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 20 వేలవరకు వచ్చాయి. కానీ.. ఇప్పుడు టోక్యోలో వంద దాటడం లేదు. ఆదివారం అయితే 40 కేసులే వచ్చాయి. పైగా ఇది వరుసగా తొమ్మిదో రోజు వంద కంటే తక్కువ కేసులు రావడం. దేశవ్యాప్తంగానూ 456 కేసులే వెలుగుచూశాయి. దీనంతటికి కచ్చితమైన కారణాలు తెలియకపోయినా.. ముమ్మర వ్యాక్సినేషన్‌ కీలక పాత్ర పోషించినట్లు స్థానిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్థానికులు నైట్‌లైఫ్‌కు దూరంగా జరగడం, విధిగా మాస్కులు ధరించడం, ఆగస్టు నెలాఖరులో వాతావరణ ప్రతికూలతల కారణంగా చాలామంది ఇళ్లకే పరిమితం కావడం వంటివి కేసుల తగ్గుదలకు దోహదపడినట్లు వివరిస్తున్నారు.

'6.50 లక్షల కొత్త కేసులు రాకుండా కట్టడి'

ఈ ద్వీప దేశంలో ఫిబ్రవరి మధ్యలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మే వరకు నెమ్మదిగా సాగినా.. జులైలో ఒలింపిక్స్‌ దృష్ట్యా ఊపందుకుంది. దీంతో జులైలో 15 శాతంగా ఉన్న వ్యాక్సినేషన్‌ రేటు అక్టోబరుకు 65 శాతానికి చేరింది. 12.58 కోట్ల జనాభాగల ఈ దేశంలో ప్రస్తుతం 70 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది. టీకాలతో 6.50 లక్షల మందికి ఇన్ఫెక్షన్ రాకుండా చేసినట్లు, దాదాపు 7,200కు పైగా ప్రజల ప్రాణాలు కాపాడినట్లు క్యోటో యూనివర్సిటీ ప్రొఫెసర్ హిరోషి నిషియురా అంచనా వేశారు. 64 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి టీకాలు వేయడంతో.. తాత్కాలికంగా హెర్డ్‌ ఇమ్యూనిటీకి సమాన పరిస్థితి సృష్టించొచ్చని, ఇక్కడ ఇదే జరిగినట్లు ఇక్కడి టోహో యూనివర్సిటీలోని వైరాలజీ ప్రొఫెసర్ డా.కజుహిరో టటెడా అభిప్రాయపడ్డారు. దేశ వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం డైరెక్టర్ నోరియో ఓమగారి సైతం వ్యాక్సినేషన్‌ ప్రభావమే ఇందుకు కారణమని స్పష్టం చేశారు. చాలామంది తెలియకుండానే ఇప్పటికే వైరస్‌ బారినపడి, సహజ రోగనిరోధక శక్తి సంపాదించి ఉండొచ్చని తెలిపారు.

మరో వేవ్‌పై ఆందోళన..

కేసులు పెరిగినప్పుడల్లా.. జపాన్ లాక్‌డౌన్ విధించకుండా ప్రజల రాకపోకలను కట్టడి చేస్తోంది. ప్రధానంగా బార్లు, ఫుడ్‌ సెంటర్లను నియంత్రిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానాన్ని నిషేధిస్తోంది. అయితే.. కేసులు ఎందుకు భారీగా తగ్గాయనే దానిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రజారోగ్య నిపుణులు కోరుతున్నారు. టీకాల సామర్థ్యం కూడ క్రమంగా క్షీణిస్తుండటం, శీతాకాలం సమీపిస్తుంటంతో.. మరో వేవ్‌ వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్లుగా జనసమ్మర్థం పెరుగుతుండటంతో రాబోయే వారాల్లో వైరస్‌ వ్యాప్తిపై ప్రభావం పడొచ్చని టోక్యోలోని రీసెర్చ్ సెంటర్ ఫర్ సోషల్ సైన్స్ అండ్‌ మెడిసిన్ సైన్సెస్ డైరెక్టర్ అట్సుషి నిషిదా చెబుతున్నారు. జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిదా సైతం ఈ విషయమై మాట్లాడుతూ.. నవంబర్ ప్రారంభంలో రోజువారీ కార్యకలాపాలపై కఠిన ఆంక్షలు విధిస్తామని వెల్లడించారు. మహమ్మారి ఒక వేళ మళ్లీ విజృంభిస్తే.. బాధితుల చికిత్స కోసం మరిన్ని పడకలు, సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ దేశంలో ఇప్పటివరకు మొత్తం 1.72 మిలియన్‌ కేసులు రాగా,18 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.