ETV Bharat / international

'దలైలామాకు ఆతిథ్యమిస్తున్న భారత్​కు కృతజ్ఞతలు'

ప్రముఖ టిబెటన్​ ఆధ్యాత్మిక వేత్త దలైలామాకు 1959 నుంచి ఆతిథ్యమిస్తున్న భారత్​కు కృతజ్ఞతలు తెలిపింది అమెరికా. తన శాంతి బోధనల ద్వారా ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచారంటూ దలైలామాను కీర్తించింది.

US thanks India for hosting Dalai Lama since 1959
'దలైలామాకు ఆతిథ్యమిస్తున్నందుకు భారత్​కు కృతజ్ఞతలు'
author img

By

Published : Jul 7, 2020, 5:11 PM IST

1959 నుంచి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దలైలామాకు ఆతిథ్యమిస్తున్నందుకు భారత్​కు ధన్యవాదాలు తెలిపింది అమెరికా. జులై 6న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖలోని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల బ్యూరో ఈ మేరకు ఓ ట్వీట్​ చేసింది.

''తన శాంతి బోధనల ద్వారా ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిన దలైలామాకు 85వ పుట్టినరోజు శుభాకాంక్షలు. టిబెటన్ల పోరాటం, వారి వారసత్వానికి ఒక గుర్తుగా నిలిచారు. 1959 నుంచి దలైలామాకు, టిబెటన్లకు ఆతిథ్యమిస్తున్న భారత్​కు కృతజ్ఞతలు.''

- అమెరికా విదేశాంగ శాఖ ఎస్​సీఏ బ్యూరో ట్వీట్​

అమెరికా చట్ట సభ సభ్యులు, స్పీకర్​ నాన్సీ పెలోసీ సహా పలువురు ప్రముఖులు దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

''దలైలామా ఆధ్యాత్మికత.. ప్రేమ, కరుణ పెంపొందించడానికి, మత సామరస్యాన్ని ప్రోత్సహించడానికి, మానవ హక్కుల పరిరక్షణకు ఎంతో దోహదపడుతుంది.'

- నాన్సీ పెలోసీ, అమెరికా ప్రజాప్రతినిధుల సభ స్పీకర్​

1959లో చైనీయుల టిబెట్​ ఆక్రమణ సమయంలో భారత్​కు వచ్చారు దలైలామా. అప్పటి నుంచి ధర్మశాలలోనే నివాసముంటున్నారు.

ఇదీ చూడండి:బంగారం స్మగ్లింగ్​ కుంభకోణంలో మరో మలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.