ETV Bharat / international

అమెరికాలో కరోనాకు ఒక్కరోజే 3000 మంది బలి

అమెరికాలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. ఒక్కరోజే 3000 మందినిపైగా బలిగొంది. ఇప్పటివరకు నమోదైన రోజువారీ మరణాల్లో ఇదే అత్యధికం. మరోవైపు జపాన్​ రాజధానిలో తొలిసారిగా 600కుపైగా కొవిడ్ కేసులు​ నమోదుకావడంపై అక్కడి అధికారులు ఆందోళన చెందుతున్నారు.

US sets new grim record with over 3,000 COVID deaths in single day
అమెరికాలో కరోనా రికార్డు- ఒక్కరోజే 3000 మంది బలి
author img

By

Published : Dec 10, 2020, 3:48 PM IST

కరోనా కేసులు, మరణాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఒక్కరోజే 3,054 మంది కొవిడ్​తో మృతి చెందారు. ఇప్పటివరకు రోజువారీ నమోదవుతున్న కొవిడ్ మరణాల్లో ఇవే అత్యధికం. ఈ ఏడాది మే 7న ఇదే స్థాయిలో 2,769 మంది మరణించారు. అగ్రరాజ్యంలో మొత్తం మరణాల సంఖ్య 2 లక్షల 96 వేలు దాటింది. రెండు వ్యాక్సిన్​లు దాదాపు అందుబాటులోకి వచ్చేలా కనిపిస్తున్నా.. ఈ స్థాయిలో వైరస్​ మరణాలు సంభవించడం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అమెరికాలో బుధవారం ఒక్కరోజే 18 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించగా... 2 లక్షల 10 వేల కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 58 లక్షలు దాటింది.

ఈ నేపథ్యంలో ఫైజర్ టీకా అత్యవసర వినియోగంపై అమెరికా ఆహార, ఔషధ పరిపాలనా సంస్ధ (ఎఫ్​డీఏ) సహా సంబంధిత అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం చివరినాటికి 10 కోట్ల మందికి వ్యాక్సిన్​ అందించాలని భావిస్తున్నారు.

టోక్యోలో తొలిసారి

జపాన్​లో రాజధాని టోక్యోలో తొలిసారిగా 600కు పైగా కరోనా కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా 2,810 కేసుల్లో రాజధానిలోనే 602 కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 6 కోట్ల 93 లక్షల మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు. 15 లక్షల 77 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

దేశంకేసులుమరణాలు
అమెరికా1,58,22,7342,96,745
భారత్​97,67,3711,41,772
బ్రెజిల్​67,30,1181,79,032
రష్యా25,69,12645,280
ఫ్రాన్స్​23,24,21656,648

ఇదీ చూడండి: పెరుగుతున్న గుండె జబ్బుల మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.