ETV Bharat / international

'హ్యాకర్లకు అమెరికా అతిపెద్ద స్వర్గధామం'

సైబర్​ నేరగాళ్లకు అమెరికానే అతిపెద్ద సురక్షితమైన స్వర్గధామమని ఆరోపించింది చైనా. పీఎర్​ఐఎస్​ఎం కార్యక్రమం ద్వారా అది నిరూపితమైందని పేర్కొంది. టిక్​టాక్​, వీచాట్​ యాప్​ల నుంచి చైనా మిలటరీ, అధికార పార్టీకి సమాచారం చేరుతోందని శ్వేతసౌధం అధికారి పేర్కొనటంపై ఈ మేరకు స్పందించింది.

US biggest 'safe haven for hackers': spokesperson
'హ్యాకర్లకు అమెరికా అతిపెద్ద సురక్షితమైన స్వర్గధామం'
author img

By

Published : Jul 14, 2020, 11:48 AM IST

అమెరికాపై మరోమారు ఆరోపణలు చేసింది చైనా. ప్రపంచవ్యాప్తంగా విచక్షణారహితంగా, చట్టవిరుద్ధమైన గూఢచర్యం, నిఘాకు పాల్పడే హ్యాకర్లకు అమెరికా అతిపెద్ద సురక్షితమైన స్వర్గధామంగా ఉన్నట్లు ఆరోపించింది. పీఎర్​ఐఎస్​ఎం కార్యక్రమం ద్వారా ఇది నిరూపితమైందని వెల్లడించింది.

టిక్​టాక్​, వీచాట్​ యాప్​ల ద్వారా సమాచారం చైనా మిలిటరీకి, కమ్యూనిస్ట్​ పార్టీ ఆఫ్​ చైనాకు చేరుతుందని పేర్కొన్నారు శ్వేతసౌధం వాణిజ్య సలహాదారు పీటర్​ నవారో. ఈ రెండు యాప్​లపై కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.

పీటర్​ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ.. అమెరికానే హ్యాకర్లకు అతిపెద్ద నిలయమని ఆరోపించారు చైనా ప్రతినిధి హువా చునైంగ్​.

" సమాచారం మొత్తం చైనా మిలిటరీకి, సీపీసీకి వెళుతుందని ఆయన చెప్పారు. దానికి సాక్ష్యాలు ఎక్కడున్నాయో నాకు తెలియదు. వాటిని ప్రజలకు చూపించగలరా? అమెరికా బలంగా ఉన్నప్పుడు.. సామాజిక మాధ్యమాల్లో యువత వినోద వీడియోలను పంచుకుంటే ఎందుకు బయపడుతోంది. బలమైన అమెరికా ఎందుకు అంత ఆందోళన చెందుతోంది? ఇది నవారో వంటి అధికారులు ఆలోచించదగిన ప్రశ్న అని భావిస్తున్నా."

- హువా చునైంగ్​, చైనా అధికార ప్రతినిధి.

ఇదీ చూడండి: ఆ విషయంలో రష్యా, చైనా కంటే అమెరికానే బెస్ట్: ట్రంప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.