భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రుల స్థాయి రెండో ‘చతుర్ముఖ’ సమావేశం టోక్యోలో మంగళవారం ప్రారంభమైంది. కరోనా ప్రారంభమైన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఈ భేటీ రెండు రోజులు కొనసాగనుంది.
హిందూ-పసిఫిక్ అంతటా చైనా దుందుడుకు చర్యల నేపథ్యంలో ఈ చతుర్ముఖ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాతో భారత్‌కు మాత్రమే కాదు.. ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలకూ తీవ్ర విభేదాలు ఉన్నాయి.
ఈ భేటీలో భాగంగా తొలుత నాలుగు దేశాల విదేశాంగ మంత్రులతో జపాన్ ప్రధాని యోషిహిండే సూగా సమావేశమయ్యారు. హిందూ- పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్యంతో పాటు చైనా దూకుడుకు కళ్లెం వేయటం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు సూగా. కరోనా తర్వాత ఈ సవాళ్లను సమన్వయంతో ఎదుర్కోవాలని సూచించారు.
ఇదీ చూడండి: 'క్వాడ్' స్కెచ్‌తో చైనాలో కంగారు- భారత్‌పై ఫైర్