ETV Bharat / international

'అండర్​ కవర్​' రిపోర్టర్ అని తెలియక భారీ ప్రమోషన్! - చైనా రిపోర్టర్​

ఓ వ్యక్తి సాధారణ సేల్స్​మ్యాన్​గా సెకండ్​ హ్యాండ్​ కార్ల విక్రయ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. అనతికాలంలోనే సంస్థ వైస్​- డైరెక్టర్​గా ఎదిగాడు. లక్షల జీతం, ఇతర ప్రయోజనాలు, డజన్​కుపైగా ఉద్యోగులకు బాస్​. సీన్​ కట్​ చేస్తే... తన వృత్తి నిబద్ధతకు కట్టుబడి కార్ల విక్రయ సంస్థలో జరిగే అవినీతిని బహిర్గతం చేశాడు. లక్షల ఉద్యోగాన్ని మానేసి.. తన వృత్తిలో నిమగ్నమయ్యాడు. అతనే ఓ ఇన్వెస్టిగేటివ్​ రిపోర్టర్​.

Undercover reporter
సేల్స్​మెన్​ నుంచి డైరెక్టర్​గా 'అండర్​ కవర్​' రిపోర్టర్​
author img

By

Published : Mar 18, 2021, 4:00 PM IST

సెకండ్​ హ్యాండ్​ కార్ల విక్రయ సంస్థలో జరుగుతున్న స్కాంను బయటపెట్టాలనుకున్నారు ఓ జర్నలిస్ట్​. అందుకు ఒక సాధారణ ఉద్యోగిగా చేరారు. తన ప్రతిభతో తక్కువ సమయంలోనే సంస్థ వైస్​ డైరెక్టర్​గా ఎదిగారు. కానీ, తన వృత్తికి కట్టుబడి అవినీతిని బయటపెట్టారు. లక్షల జీతాన్ని వదిలి తన వృత్తిలో నిమగ్నమయ్యారు. అతనే ఇన్వెస్టిగేటివ్​ రిపోర్టర్​ లావో కే.

చైనాకు చెందిన సెంట్రల్​ టెలివిజన్​ (సీసీటీవీ)లో ప్రసారమయ్యే 315 షోలో ఇన్వెస్టిగేటివ్​ రిపోర్టర్​గా పనిచేస్తున్నారు లావో కే. సీసీటీవీ ఏటా.. వినియోగదారుల దినం సందర్భంగా వారి హక్కులపై ఓ షో నిర్వహిస్తుంది. వేర్వేరు చోట్ల జరిగే అక్రమాలు, కుంభకోణాలపై పరిశోధనాత్మక కథనాలు ప్రసారం చేస్తుంటుంది.

ఈ ఏడాది ప్రసారమైన 315 షో తర్వాత.. లావో కే తన అనుభవాన్ని ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. తాను కొద్ది సంవత్సరాల క్రితం ఓ సెకండ్​ హ్యాండ్​ కార్ల విక్రయ సంస్థలోకి అండర్​కవర్​ ఆపరేషన్​కు వెళ్లినట్లు తెలిపారు. ఆ సంస్థ కార్ల నిజమైన ధర కన్నా ఎక్కువకు అమ్ముతూ ఏ విధంగా మోసం చేస్తోందో తెలిపేందుకే ఆలా చేసిన్నట్లు చెప్పుకొచ్చారు.

తొలుత.. కార్ల సంస్థలో తనకు ఎలాంటి అనుభవం లేని సేల్స్​ విభాగంలో చేరారు లావో. అయితే.. ఆ ఉద్యోగం ఇన్వెస్టిగేషన్​కు ఉపయోగపడదని గుర్తించారు. ఆ తర్వాత తన ప్రతిభతో ఉన్నత స్థానానికి చేరారు.

" నేను ఎక్కువగా కష్టపడేందుకు ఇష్టపడతాను. సంస్థలో చేరిన తర్వాత నా పనితీరు గణనీయంగా మెరుగుపడింది. సాధారణ సెల్స్​మ్యాన్​ నుంచి కంపెనీ వైస్​ డైరెక్టర్​ స్థాయికి చేరుకున్నాను. అలాంటి ఉన్నత స్థానానికి చేరుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు."

- లావో కే, ఇన్వెస్టిగేటివ్​ రిపోర్టర్​

బోర్డు సభ్యుడై...

సంస్థ ఎగ్జిక్యూటివ్​ బోర్డులో ఉండటం వల్ల తన ఇన్వెస్టిగేషన్​ సాఫీగా సాగిందని తెలిపారు లావో. వివిధ ధరల్లో సంస్థ కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన కీలక పత్రాలను పొందటం సులువైనట్లు వెల్లడించారు. ఒక్కోసారి ఒక కారుపై 5000 యువాన్లకుపైగా అదనపు లాభాన్ని పొందేవారని తెలిపారు.

లక్షల జీతం వదులుకుని..

315 షో ప్రసారం తర్వాత.. కార్ల సంస్థలో ఉద్యోగం వదిలేశారు లావో కే. సీసీటీవీలో ఇన్వెస్టిగేటివ్​ రిపోర్టర్​గా తన విధులను మళ్లీ ప్రారంభించారు. మరో సంస్థలో అవినీతిని బయటపెట్టేందుకు సిద్ధమయ్యారు.

తన పరిశోధనలతో సీసీటీవీ డైరెక్టర్​ సంతోషించినప్పటికీ.. అదే సమయంలో తన గురించి ఆందోళన చెందుతున్నారని తెలిపారు లావో. అధిక జీతం, ఇతర ప్రయోజనాలు కోల్పోవటం వల్ల ఇబ్బందులు పడుతున్నానేమోనని ప్రతిరోజు తనకు డైరెక్టర్​ కాల్​ చేసి అడుగుతున్నారని వెల్లడించారు.

నెటిజన్ల కామెంట్లు..

షో తర్వాత లావో సాహసాన్ని.. హాంగ్​కాంగ్​ సినిమా 'ఇన్​పెర్నల్​ అఫైర్స్'​తో పోలుస్తూ కామెంట్లు చేశారు నెటిజన్లు.

"ఆయన్ను వెనక్కి రమ్మని మీరు చెప్పకపోయుంటే.. కంపెనీ సీఈఓ అయ్యేవారు. " అని ఓ నెటిజన్​ కామెంట్​ చేశాడు.

ప్రముఖ సంస్థల అవినీతి బహిర్గతం..

ఈ ఏడాది 315 షోలో... కొహ్లెర్​ షాప్స్​ వినియోగదారుల డేటాను తెలుసుకునేందుకు ముఖ గుర్తింపును ఉపయోగించటం, యూసీ బ్రౌజర్​ ఫేక్​ ప్రకటనలను ప్రమోట్​ చేయటం, ఇన్ఫినిటీ కార్లలో నకిలీ గేర్​బాక్సులు ఉండటం వంటివి సంచలన కథనాలు ఉన్నాయి.

గతంలో ఇదే షోలో పరిశోధనాత్మక కథనాల ప్రసారం తర్వాత ఫోక్స్​వాగన్​, యాపిల్​ వంటి ప్రముఖ సంస్థలు బహిరంగ క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: పోకిరి 2.0: అరటి పళ్లు అమ్ముతూ ఎస్​ఐ అండర్ కవర్​ ఆపరేషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.