ETV Bharat / international

ఉక్రెయిన్‌ అధ్యక్షుడి హత్యకు ప్రైవేటు సైన్యం? - ఉక్రెయిన్​ అధ్యక్షుడు

Zelenskyy left Ukraine: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దురాక్రమణ తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. వేల సంఖ్యలో ఇరు దేశాల సైనికులతో పాటు సామాన్యులూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడి హత్య లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. సైనిక చర్య మొదలైన వారం రోజుల్లోనే ఆయన హత్యకు మూడుసార్లు ప్రయత్నం జరిగినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, అప్రమత్తమవుతోన్న భద్రతా దళాలు ఎప్పటికప్పుడు వాటిని భగ్నం చేస్తున్నట్లు సమాచారం.

Zelenskyy left Ukraine
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు
author img

By

Published : Mar 4, 2022, 10:04 PM IST

Zelenskyy left Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రతరం చేసిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ దేశం విడిచి వెళ్లినట్లు తమ ఓ ఎంపీ అన్నట్లు రష్యా మీడియా పేర్కొంది. ఈ మేరకు రష్యాకు చెందిన మీడియా సంస్థ వార్తలను ప్రచురించింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఉక్రెయిన్‌ను విడిచి పోలాండ్‌ వెళ్లినట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడిని చంపేందుకు వందల మంది ప్రైవేటు సైన్యం కీవ్‌లోకి అడుగుపెట్టిందనే వార్తలు వారం రోజులుగా ప్రచారంలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడిని హత్య చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. సైనిక చర్య మొదలైన వారం రోజుల్లోనే ఆయనపై మూడుసార్లు హత్యాయత్నం జరిగినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. జెలెన్‌స్కీని చంపడానికి క్రెమ్లిన్‌ మద్దతున్న వాగ్నర్‌ గ్రూప్‌తో పాటు చెచెన్‌ స్పెషల్‌ ఫోర్స్‌ పలుమార్లు ప్రయత్నించినట్లు తాజాగా లండన్‌ వేదికగా ఉన్న ఓ అంతర్జాతీయ వార్త సంస్థ వెల్లడించింది. కీవ్‌లో మాటువేసిన వాగ్నర్‌ (రష్యాకు చెందిన పారామిలటరీ ప్రైవేటు సైన్యం) గ్రూపునకు చెందిన సాయుధ దళాలు ఉక్రెయిన్‌ అధ్యక్షుడి హత్యకు రెండుసార్లు ప్రయత్నించి విఫలమైనట్లు పేర్కొంది. ఆ క్రమంలో వాగ్నర్‌ గ్రూపులో కొందరు హతమైనట్లు వెల్లడించింది.

అందుకే ప్రైవేటు సైన్యం..

'హై ప్రొఫైల్‌ మిషన్‌తోనే వారు రంగంలోకి దిగుతారు. దేశాధినేత శిరచ్ఛేదం అనేది ఓ భారీ లక్ష్యం. అది రష్యన్‌లు కూడా తిరస్కరించేదే. అందుకే ఒకవేళ అధ్యక్షుడి హత్య విజయవంతమైతే, ఆ కుట్రలో తమ ప్రమేయం లేదని చెప్పుకునేందుకే ఈ ప్రైవేటు సైన్యాన్ని మోహరించి ఉండవచ్చు' అని వీరి కార్యకలాపాల గురించి తెలిపిన ఓ దౌత్య విశ్లేషకులు వెల్లడించారు.

ఎవరీ వాగ్నర్‌..?

వాగ్నర్ గ్రూప్ అనేది ఒక ప్రైవేట్ సైన్యం. క్రెమ్లిన్ తన వ్యూహాత్మక లక్ష్యాలను నెరవేర్చడానికి దీన్ని ఉపయోగిస్తుందని నమ్ముతారు. ఈ బృందంలో అత్యధికంగా మాజీ సైనికులే ఉంటారు. 2017లో బ్లూమ్‌బెర్గ్‌ లెక్క ప్రకారం ఈ గ్రూపులో 6,000 మంది ఉన్నారు. ముఖ్యంగా లిబియా, సిరియా, సెంట్రల్‌ ఆఫ్రికాతోపాటు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతాల్లో వీరి అరాచకాలు ఎక్కువగా ఉంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలా వివిధ ప్రాంతాల్లో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయన్న కారణంగా అమెరికాతోపాటు ఈయూ దేశాలు గతేడాది డిసెంబర్‌లో వాగ్నర్‌ గ్రూప్‌పై ఆంక్షలు విధించాయి.

ఇదిలాఉంటే, రష్యా జరుపుతోన్న దాడులపై ఇప్పటికే పలుసార్లు మాట్లాడిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. రష్యా బలగాలకు తానే నంబర్‌ 1 లక్ష్యమని పేర్కొన్నారు. తర్వాత తన కుటుంబమే వారి లక్ష్యమని చెప్పారు. అయినా తాను కీవ్‌ను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు కీవ్‌ నగరాన్ని వీడాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడిని పశ్చిమ దేశాలు సూచించడానికి ఇదే కారణంగా తెలుస్తోంది.

దాడిని ఖండించిన జెలెన్​క్సీ..

ఉక్రెయిన్‌లోని జాపోరిషియా అణు విద్యుత్తు కేంద్రంపై రష్యా చేసిన దాడిని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. రష్యన్‌ బలగాలు కావాలనే అణువిద్యుత్‌ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగాయని మండిపడ్డారు. ఒకవేళ జాపోరిషియా అణువిద్యుత్‌ కేంద్రం పేలి ఉంటే అది చెర్నోబిల్‌ అణువిద్యుత్‌ కేంద్రం దుర్ఘటన కంటే 6 రెట్లు అధికంగా ఉండేదని తెలిపారు. అదే జరిగితే ఈ రాత్రి ఉక్రెయిన్‌తోపాటు ఐరోపా చరిత్రకు ముగింపు పలికేదని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. అణు విద్యుత్ కేంద్రంపై మాస్కో సేనలు దాడిచేసి ఆక్రమించుకోవడాన్ని ఖండిస్తూ రష్యా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. మరోవైపు... జాపోరిషియా అణువిద్యుత్తుకేంద్రంపై దాడి చేసిన రష్యాపై మరిన్న కఠిన చర్యలు తీసుకోవాలని జెలెన్‌స్కీ వివిధ దేశాలను డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:

రష్యాకు వ్యతిరేకంగా ఐరాసలో ఓటింగ్​... భారత్ దూరం

ఉక్రెయిన్​లోని మరో భారత విద్యార్థికి బుల్లెట్​ గాయం

అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రంపై రష్యా దాడి.. ఐఏఈఏ ఆందోళన

సుమీలో 700 మంది భారత విద్యార్థులు- 7 రోజులుగా బిక్కుబిక్కుమంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.