ETV Bharat / international

ఉక్రెయిన్​ యుద్ధంలో రసాయన, జీవ 'ఆయుధ' రగడ - why are biological weapons banned

Ukraine War: ఉక్రెయిన్​-రష్యా యుద్ధంలో అణ్వస్త్రాలకు తోడు జీవ, రసాయన ఆయుధ అంశాలు తెరమీదికొచ్చాయి. ఉక్రెయిన్​లో అమెరికా జీవ ఆయుధ ల్యాబ్‌లు నడిపిస్తోందని రష్యా ఆరోపించింది. నిశ్శబ్దంగా పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలు హరించే ఈ అస్త్రాలపై ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేగుతోంది. ఇంతకీ జీవ, రసాయన ఆయుధాల వల్ల కలిగే నష్టాలేంటి?

Ukraine War
ఉక్రెయిన్​ యుద్ధం
author img

By

Published : Mar 13, 2022, 8:16 AM IST

Ukraine War: ఉక్రెయిన్‌ యుద్ధంలో అణ్వస్త్ర ప్రయోగ భయం ప్రపంచాన్ని వెంటాడుతుండగా ఇప్పుడు దానికి జీవ, రసాయన ఆయుధ అంశం తోడైంది. అమెరికా ఆధ్వర్యంలో అక్కడ జీవ ఆయుధ ల్యాబ్‌లు నడుస్తున్నాయని రష్యా ఆరోపించగా.. ఆ నెపంతో సామూహిక జనహనన ఆయుధాలను ప్రయోగించేందుకు పుతిన్‌ సిద్ధపడుతున్నారన్నది వాషింగ్టన్‌ నుంచి వస్తున్న ప్రతివిమర్శ. నిశ్శబ్దంగా పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలు హరించే ఈ అస్త్రాలపై ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేగుతోంది. ఇంతకీ జీవ, రసాయన ఆయుధాల వల్ల కలిగే నష్టాలేంటి?

Ukraine War
ఉక్రెయిన్​ యుద్ధంలో రసాయన, జీవ ఆయుధాలు

విషతుల్యం.. ప్రాణాంతకం

Biological Weapons in Wars: రసాయనాల్లోని విషతుల్య లక్షణాలను ఉపయోగించుకొని ఉద్దేశపూర్వకంగా ప్రాణహాని కలిగించేలా రూపొందించే సాధనాలను రసాయన ఆయుధాలుగా పేర్కొంటారు. వీటిలో పలు రకాలు ఉన్నాయి.

Ukraine War
విషతుల్యం.. ప్రాణాంతకం

నెర్వ్‌ ఏజెంట్లు

ఇవి నాడుల నుంచి కండరాలకు వెళ్లే కీలక సందేశాలను అడ్డుకుంటాయి. ఫలితంగా కండరాల్లో పక్షవాతం వస్తుంది. శరీర ధర్మాలు స్తంభించిపోతాయి. సారిన్‌, సొమన్‌, టబున్‌, నోవిచోక్‌ వంటి రసాయనాలు దీనికి ఉదాహరణ.

రైసిన్‌ టాక్సిన్‌

ఇది ఒకింత తక్కువ హానికరమైన రసాయనం. దీన్ని చాలా తేలిగ్గా వ్యాప్తి చేయవచ్చు. ఒక మోస్తరు స్థాయిలో వ్యాధి లక్షణాలు కలిగిస్తుంది. క్యాస్టర్‌ బీన్స్‌ వ్యర్థాల నుంచి దీన్ని తయారుచేస్తారు.

Ukraine War
రైసిన్‌ టాక్సిన్‌

సైనైడ్‌

ఇది సహజసిద్ధంగా మొక్కల ద్వారా లభ్యమవుతుంది. పూర్వం నుంచి దీన్ని యుద్ధాల్లో వాడుతున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో తొలిసారిగా దీన్ని వాయు రూపంలో రసాయన ఆయుధంగా ఉపయోగించారు. దీనివల్ల కళ్లు తిరగడం, తలనొప్పి, స్పృహ కోల్పోవడం, పక్షవాతం, గుండెపోటు వంటివి తలెత్తుతాయి. డోసు ఎక్కువైతే వేగంగా మరణం సంభవిస్తుంది.

సల్ఫర్‌ మస్టర్డ్‌

మస్టర్డ్‌ గ్యాస్‌ పేరుతోనూ పిలిచే ఈ రసాయనాన్ని తొలిసారిగా మొదటి ప్రపంచ యుద్ధంలో వాడారు. వాతావరణంలో సహజసిద్ధంగానే ఇది లభ్యమవుతుంది. దీనివల్ల చర్మంపై బొబ్బలు వస్తాయి.

సూక్ష్మజీవం మహా ప్రమాదకరం..

హానికర వైరస్‌లు, బ్యాక్టీరియా, శిలీంద్రాలను ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తి చేసి, విడుదల చేసే సాధనాలను జీవాయుధాలుగా పేర్కొంటారు. రసాయన ఆయుధాల కన్నా ఇవి మరింత ప్రమాదకరం. వీటివల్ల భారీగా వ్యాధులు, మరణాలు ప్రబలుతాయి. నిర్దిష్ట ప్రదేశంలో ఆహారాన్ని కలుషితం చేయడం నుంచి ప్లేగు కలిగించే సూక్ష్మజీవులు వరకూ అనేకం ఇందులో ఉంటాయి. వీటి కారకులను గుర్తించడం కష్టం. జీవాయుధాల్లో ప్రధానమైనవివీ..

ఆంత్రాక్స్‌

Why are Biological Weapons Banned: అత్యంత తీవ్రమైన జీవ ఉగ్రవాద ముప్పుగా ఆంత్రాక్స్‌ను పరిగణిస్తున్నారు. ఇది ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాధి. 20వ శతాబ్దం ద్వితీయార్ధంలో జీవాయుధ కార్యక్రమంలో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. దీనివల్ల చర్మంపై పుండ్లు ఏర్పడతాయి. వాంతులు, అయోమయం, తీవ్ర కేసుల్లో మరణం సంభవిస్తుంది. దీన్ని శ్వాస ద్వారా పీల్చుకుంటే చికిత్స చేయడం కష్టం.

బొటులినుం టాక్సిన్‌

బొటులినం బ్యాక్టీరియా తీవ్ర విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది నాడీ సంబంధ విధులను అడ్డుకుంటుంది. ఫలితంగా శ్వాస, కండరాల్లో పక్షవాతం కలుగుతుంది. దీనికి చికిత్స కష్టం. ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి, రవాణా సులువు. అందువల్ల దీన్ని ప్రధాన జీవాయుధ ముప్పుగా పరిగణిస్తున్నారు.

మశూచి
భారీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంతో సహజసిద్ధ మశూచి (స్మాల్‌ పాక్స్‌) వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. 1977లో చివరి కేసు నమోదైంది. అయితే దీన్ని జీవాయుధంగా ప్రయోగించే వీలుంది. 18వ శతాబ్దంలో ఫ్రాన్స్‌, భారత్‌లలో జరిగిన యుద్ధాల్లో బ్రిటన్‌ దీన్ని వాడింది. తుంపర్ల రూపంలో ప్రయోగించే వీలున్న మశూచి ఆయుధాన్ని 1980లలో సోవియట్‌ యూనియన్‌ అభివృద్ధి చేసినట్లు చెబుతారు. దీనివల్ల శరీరంపై దద్దుర్లు, జ్వరం, తలనొప్పి చోటుచేసుకుంటాయి. కొందరిలో కంటి చూపు కూడా పోతుంది. అనేకమంది చనిపోతుంటారు.

ప్లేగు
వై పెస్టిస్‌ అనే బ్యాక్టీరియాతో ఈ వ్యాధి వస్తుంది. ఈ సూక్ష్మజీవులను నీటి తుంపర్ల ద్వారా ప్రయోగించొచ్చు. ఈ వ్యాధి వల్ల తీవ్ర జ్వరం, చలి, తల నొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, తలతిరగడం వంటివి ఉత్పన్నమవుతాయి. ఇందులో నిమోనిక్‌ ప్లేగు ప్రమాదకరమైంది.

వీటికితోడు రక్తస్రావానికి దారితీసే జ్వరాలు కలిగించే సూక్ష్మజీవులు, ఫ్రాన్సిసెల్లా టులారెన్సిస్‌ బ్యాక్టీరియా వంటివాటిని జీవాయుధాలుగా వాడే వీలుంది.

గతంలో జరిగిన జన హననాలివీ..

Russia Invasion: 'సోవియట్‌' నాటి నుంచి రసాయన, జీవాయుధాల ఉత్పత్తి చేసే చరిత్ర రష్యాకు ఉందని నిపుణులు చెబుతున్నారు. అవసరమైతే వాటిని స్వదేశంలో కానీ విదేశాల్లో గానీ ప్రయోగించేందుకూ వెనకాడని నైజాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.

2002లో చెచెన్యా తిరుగుబాటుదారులు మాస్కోలోని ఒక థియేటర్‌పై దాడి చేసి, అక్కడివారిని బందీలుగా తీసుకున్నారు. రంగంలోకి దిగిన రష్యా ప్రత్యేక బలగాలు.. థియేటర్‌లోకి కార్ఫెంటానిల్‌ అనే గ్యాస్‌ను ప్రయోగించాయి. అది మార్ఫిన్‌ కన్నా 10 వేల రెట్లు శక్తిమంతమైంది. దీని సాయంతో ఉగ్రవాదులు స్పృహ తప్పేలా చేయాలన్నది రష్యా బలగాల వ్యూహం. అయితే అది వికటించి అప్పట్లో 120 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

2006 నవంబర్‌లో గూఢచారి సంస్థ కేజీబీ మాజీ అధికారి అలెగ్జాండర్‌ లిత్వినెంకోపై రష్యా అధికారులు లండన్‌లోని ఒక హోటల్‌లో విషప్రయోగం చేశారు. ఇందుకోసం వారు పొలోనియం-210 అనే ప్రమాదకర రేడియోధార్మిక పదార్థాన్ని ఉపయోగించారు. మూడు వారాల పాటు నరకయాతన అనుభవించిన లిత్వినెంకో.. ఆసుపత్రిలో చనిపోయారు. అతడు పుతిన్‌కు గట్టి విమర్శకుడు. రేడియోధార్మికత ఆనవాళ్ల ఆధారంగా పరిశోధించినప్పుడు ఆ పదార్థం రష్యా నుంచి వచ్చినట్లు వెల్లడైంది. దీనికి ఆ దేశానిదే బాధ్యత అని ఐరోపా మానవ హక్కుల కోర్టు తేల్చింది.

2018లో రెండు రష్యా సైనిక గూఢచారి విభాగం (జీఆర్‌యూ) అధికారులు.. మాజీ సైనికాధికారి సెర్గెయ్‌ స్క్రిపాల్‌, ఆయన కుమార్తె యులియాపై నోవిచోక్‌ అనే ప్రమాదకర నెర్వ్‌ ఏజెంట్‌ను ప్రయోగించారు. బ్రిటన్‌లోని శాలిస్‌బరీలో ఈ ఘటన జరిగింది. సెర్గెయ్‌.. బ్రిటిష్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థకూ ఏజెంటుగా పనిచేశాడన్న ఆరోపణలపై రష్యా ఈ చర్యకు దిగింది. ఆయనను హత్య చేసేందుకు జీఆర్‌యూ ఏజెంట్లు పెర్‌ఫ్యూమ్‌ బాటిల్‌లో తెచ్చిన నోవిచోక్‌ను బ్రిటన్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఏకంగా 10వేల డోసులు ఉన్నట్లు గుర్తించారు.

2020 ఆగస్టులో రష్యా విపక్ష నేత, పుతిన్‌కు బద్ధ వ్యతిరేకి అలెక్సీ నవాల్నిపైనా నోవిచోక్‌ ప్రయోగం జరిగింది. నవాల్ని.. సైబీరియా వెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. మరణం అంచుల వరకూ వెళ్లిన ఆయన.. జర్మనీలో చికిత్స పొంది కోలుకున్నారు. అనంతరం రష్యా వచ్చినప్పుడు ఆయనను ప్రభుత్వం జైల్లో పెట్టింది.

అదే బాటలో సిరియా..

పుతిన్‌కు గట్టి మద్దతుదారు అయిన సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ కూడా విచ్చలవిడిగా రసాయన ఆయుధాలను వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2013 ఆగస్టు 21న సిరియా రాజధాని డమాస్కస్‌ శివార్లలోని ఘౌటా ప్రాంతంపై సారిన్‌ అనే నెర్వ్‌ ఏజెంటుతో కూడిన రాకెట్లను ప్రయోగించింది. దీనివల్ల శ్వాసకోశ వ్యవస్థ స్తంభించిపోయి, ఊపిరాడక నురగలు కక్కుతూ వందల మంది అత్యంత దారుణంగా చనిపోయారు. రసాయన ఆయుధాల ఒప్పందం-1997 ప్రకారం సరీన్‌ గ్యాస్‌ ఉత్పత్తి, నిల్వ నిషిద్ధం.

ఈ దాడి నేపథ్యంలో అమెరికా, ఫ్రాన్స్‌లు సిరియాపై వైమానిక దాడులకు సిద్ధపడ్డాయి. చివరి నిమిషంలో రసాయన ఆయుధ నిల్వలను నాశనం చేయడానికి సిరియా అంగీకరించడంతో విరమించుకున్నాయి. కొద్దివారాల పాటు సోదాలు చేసిన అమెరికా అధికారులు 1300 టన్నుల మస్టర్డ్‌ గ్యాస్‌, నెర్వ్‌ ఏజెంటు సరీన్‌, వీఎక్స్‌ను నాశనం చేశారు.

అయినా అసద్‌ సర్కారు క్లోరిన్‌ వంటి రసాయనాలను పదేపదే ప్రయోగించింది. పైగా ఆ నెపాన్ని ఐసిస్‌ లేదా అల్‌ ఖైదా ముఠాలపై మోపుతుండేది. ఇప్పుడు పుతిన్‌ కూడా ఉక్రెయిన్‌లో అదే వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వియత్నాంలో అమెరికా దారుణం

1962 నుంచి 1971 వరకూ వియత్నాంలో అమెరికా వైమానిక దళం 19 మిలియన్‌ గ్యాలన్ల మేర ‘ఏజెంట్‌ ఆరంజ్‌’ వంటి మొక్కల నాశినులను విమానాలు, హెలికాప్టర్లు, పడవలు, ట్రక్కుల ద్వారా ప్రయోగించింది. ఆ ప్రాంతంలో చెట్లు, మొక్కలను నిర్మూలించడం దీని ఉద్దేశం. దీనివల్ల తమ సైనికులు పరిసరాలను మరింత స్పష్టంగా గమనించగలుగుతారని భావించింది. అలాగే పంటలు నాశనం కావడం వల్ల ప్రత్యర్థికి నష్టం కలుగుతుందని అంచనావేసింది. ఈ రసాయనాల వల్ల క్యాన్సర్లు, మధుమేహం, పిల్లలు లోపాలతో పుట్టడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అమెరికా రసాయనాల ప్రభావం 30 లక్షల మంది వియత్నాం పౌరులపై పడిందని రెడ్‌క్రాస్‌ అంచనా. 1.5 లక్షల మంది చిన్నారులు లోపాలతో జన్మించారని తెలిపింది. అమెరికా సైనికులపైనా దీని ప్రభావం పడింది.

ఇదీ చదవండి: స్పీడు పెంచిన రష్యా.. విమానాలతో బాంబుల వర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.