ETV Bharat / international

పుతిన్‌ వంటవాడి కనుసన్నల్లో కాలకేయ సైన్యం - Ukraine Crisis

Ukraine Crisis: ఉక్రెయిన్​లో రష్యా సైన్యం విధ్వంసం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే పుతిన్​కు అత్యంత విశ్వాసపాత్రుడైన 'పుతిన్స్‌ చెఫ్' పేరు తెరమీదికొచ్చింది. ఈయన కనుసన్నల్లో ఉన్న ప్రైవేటు సైన్యం.. పుతిన్‌కు విదేశాల్లో అవసరమైన లక్ష్యాలను సాధించడానికి రహస్యంగా పనిచేస్తోంది. తాజాగా ఈ బృందానికి సంబంధించిన 400 మందిని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హత్యకు పురమాయించినట్లు సమాచారం. అసలు.. ఆ వంట మనిషి ఎవరు? పుతిన్​తో ఆయనకు ఉన్న బంధం ఏంటి?

Ukraine Crisis
ఉక్రెయిన్
author img

By

Published : Mar 3, 2022, 7:47 PM IST

Ukraine Crisis: రష్యా పాలనలో ఒలిగార్క్‌ల శక్తే వేరు.. వారంతా రష్యా ఖనిజాలు, ఇంధనం వంటి వాటిని నియంత్రిస్తూ దేశాన్ని శాసిస్తుంటారు. వీరు పుతిన్‌కు అత్యంత సన్నిహితులే..! కానీ, వీరిలో ఓ ప్రత్యేకమైన ఒలిగార్క్‌ ఉన్నాడు.. అతడు చేతిలో ఇంధనం లేదు.. ఖనిజాలు లేవు.. కేవలం ఫుడ్‌ కాంట్రాక్టులు మాత్రమే ఉన్నాయి. ఇది కాకుండా మరో కీలక విభాగం ఇతని కనుసన్నల్లో ఉంది. అదే పుతిన్‌ ప్రైవేటు సైన్యం.. వాగ్నార్‌ ప్రైవేటు మిలటరీ కంపెనీ (పీఎంసీ)‌..! ఈ గ్రూపులో మొత్తం కిరాయి సైనికులే వుంటారు. వీరు రష్యాకు, పుతిన్‌కు విదేశాల్లో అవసరమైన లక్ష్యాలను సాధించడానికి రహస్యంగా పనిచేస్తారు. తాజాగా ఈ బృందానికి సంబంధించిన 400 మందిని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హత్యకు పురమాయించినట్లు వార్తలొస్తున్నాయి.

ఆ వంట మనిషి ఎవరు..?

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పొలిటికల్‌ సర్కిల్‌లో యెవ్జెనీ ప్రిగోజిన్‌ అంటే తెలియని వారుండరు. అతన్ని 'పుతిన్స్‌ చెఫ్‌'గా వ్యవహరిస్తుంటారు. పుతిన్‌ ఆంతరంగికుల్లో ప్రిగోజిన్‌ ఒకరు. వీరిద్దరి పరిచయం, ఎదుగుదల చాలా నాటకీయంగా జరిగింది. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్‌ దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. ఆ తర్వాత హాట్‌డాగ్‌ విక్రయిస్తూ జీవించాడు. సోవియట్‌ పతనం తర్వాత సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో రెస్టారెంట్‌ స్థాపించాడు. 1990ల్లో పుతిన్‌ అక్కడ మేయర్‌ కార్యాలయంలో పనిచేసేవారు. అక్కడ పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ది వ్యాట్కా నదిపై ప్రిగోజిన్‌ 'న్యూ ఐలాండ్‌' పేరిట తేలియాడే రెస్టారెంట్‌ను స్థాపించారు. 2000లో పుతిన్‌ రష్యా అధ్యక్షుడు అయ్యారు. మరోపక్క ప్రిగోజిన్‌ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించాడు. 2001లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు జాక్‌ షిరాక్‌ పర్యటించిన సమయంలో 'న్యూ ఐలాండ్‌'లో పుతిన్‌ విందు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ప్రిగోజిన్‌ స్వయంగా అతిథులకు వడ్డించారు. ఆ తర్వాత నుంచి పుతిన్‌ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్‌ కనిపిస్తూనే ఉన్నాడు. విదేశీ అతిథులు వచ్చిన సందర్భాల్లో చాలా సార్లు ప్రిగోజిన్‌ వడ్డిస్తూ ఫొటోల్లో దర్శనమిస్తాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్‌ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి. ఆ తర్వాత 2014లో వాగ్నార్‌ పీఎంసీ నిర్వహణలో ప్రిగోజిన్‌ పాత్ర కూడా బయటకు వచ్చింది. క్రిమియా ఆక్రమణలో 'లిటిల్‌ గ్రీన్‌మ్యాన్‌' రూపంలో వాగ్నార్‌ గ్రూప్‌ హస్తం ఉంది. 2016లో ప్రిగోజిన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. 2016 అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌నకు అనుకూలంగా ప్రచారం చేయించింది కూడా ప్రిగోజిన్‌ అని ఆరోపణలు ఉన్నాయి. 'బ్యాటిల్‌ ఆఫ్‌ డెబాల్ట్సెవ్‌'లో కూడా వీరి హస్తం ఉంది. అమెరికా ఎఫ్‌బీఐ ఇతనిపై 2,50,000 డాలర్ల బహుమతి కూడా ప్రకటించింది.

ఏమిటీ వాగ్నార్‌ పీఎంసీ..?

What is Wagner Group: వాగ్నార్‌ పీఎంసీ రష్యా ప్రైవేటు సైన్యం. వాస్తవానికి ఈ పేరుతో ఏ కంపెనీ రిజిస్టరై లేదు. రష్యా సైన్యానికి చెందిన మాజీ లెఫ్టినెంట్‌ కర్నల్‌ దిమిత్రి ఉత్కిన్‌ ప్రారంభించాడు. జర్మనీ నియంతకు ఇష్టమైన ఒపేరా కంపోజర్‌ వాగ్నార్‌ పేరిట దీనిని ప్రారంభించినట్లు చెబుతారు. ఉత్కిన్‌ శరీరంపై నాజీ దళాల పచ్చబొట్లు కూడా ఉంటాయి. ఇతడు రష్యా ఇంటెలిజెన్స్‌ ఎజెన్సీ జీఆర్‌యూలో కూడా పనిచేశాడు. 1994-96, 1999-2009లలో జరిగిన రెండు చెచెన్‌ యుద్ధాల్లో పనిచేశాడు. ఉత్కిన్-ప్రిగోజిన్‌కు మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రిగోజిన్‌ వ్యాపార లక్ష్యాలు.. క్రెమ్లిన్‌ జాతీయ లక్ష్యాల మధ్య సారూప్యత ఉండటంతో వాగ్నార్‌ గ్రూప్‌కు ఎదురు లేకుండా పోయింది. వాగ్నార్‌ బృందంలో అత్యధికంగా మాజీ సైనికులే ఉంటారు. వీరికి కొన్ని సందర్భాల్లో సాధారణ రష్యా సైనికుడికంటే చెల్లింపులు ఎక్కువగా ఉంటాయి. వీరు మరణిస్తే కుటుంబానికి దాదాపు 50 వేల డాలర్ల వరకు చెల్లిస్తారు. 2017లో బ్లూమ్‌బెర్గ్‌ లెక్క ప్రకారం ఈ గ్రూపులో 6,000 మంది ఉన్నారు. ముఖ్యంగా రష్యా మిలటరీ, ఇంటెలిజెన్స్‌ వర్గాలు వీటిని నియంత్రిస్తుంటాయని సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ సంస్థ పేర్కొంది.

Ukraine Crisis
వాగ్నార్‌ పీఎంసీ

వాగ్నార్ గ్రూప్‌తో అనేక రకాలుగా రష్యాకు లాభం. సైనిక శిక్షణ పొందిన కిరాయి మనుషులు లభిస్తారు. దీంతోపాటు విదేశాల్లో లక్ష్యాలను సాధించేందుకు నేరుగా రష్యా యూనిఫామ్‌లోని మనుషులను పంపాల్సిన పనిలేదు. ఆదే సమయంలో తమకు సంబంధంలేదని తప్పించుకొని.. విదేశీ సంబంధాలును కాపాడుకోవచ్చు.

ప్రపంచంలోని పలు దేశాల్లో వాగ్నార్‌ కదలికలు..

Russia Ukraine War: ప్రపంచంలోని పలు దేశాల్లో వాగ్నార్ గ్రూప్‌ కదలికలు ఉన్నాయి. లిబియా సివిల్‌ వార్‌, సిరియా, మోజాంబిక్‌, మాలి, సుడాన్‌, ది సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌, వెనుజువెలా వంటి దేశాల్లో వాగ్నార్‌ గ్రూప్‌ ఉంది. ముఖ్యంగా సిరియాలో రష్యా అనుకూల బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వాన్ని కాపాడటంలో వాగ్నార్‌ గ్రూప్‌ రష్యా సైన్యంతో కలిసి పనిచేసింది. దాదాపు 2,500 మంది వాగ్నార్‌ సభ్యులు అసద్‌ రక్షణతో పాటు కీలక సైనిక స్థావరాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. సిరియాలోని చమురు బావుల్లోని కొంత వాటా కూడా ఈ గ్రూప్‌ తీసుకొనేట్లు ఒప్పందాలు జరిగాయి. పాల్మార్‌ ప్రాంతం స్వాధీనంలోనూ వీరు ఉన్నారు. తొలుత ఈ గ్రూపు యుద్ధ క్షేత్రానికి చేరుకొంటే.. ఆ తర్వాత రష్యా, అరబ్‌ దళాలు చేరుకొనేవి. 2018లో సిరియాలో అమెరికా దళాలు వాగ్నార్‌ గ్రూప్‌కు మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో దాదాపు 300 మంది వాగ్నార్‌ సభ్యులు మరణించినట్లు వార్తలొచ్చాయి.

Ukraine Crisis
వాగ్నార్‌ కదలికలు

రష్యా చట్టాల ప్రకారం ప్రైవేటు సైన్యం నిర్వహించడం నేరం. దీని ప్రకారం ఎప్పుడంటే అప్పుడు వాగ్నార్‌ గ్రూప్‌ను రష్యా దళాలు అణిచివేసే అవకాశం ఉంది. ఈ గ్రూప్‌ చేసిన నేరాలను రష్యాపై రుద్దకుండా ముందు జాగ్రత్తగా ఈ ఏర్పాటు చేసుకొన్నట్లు ఆరోపణలున్నాయి.

అమెరికా వద్ద బ్లాక్‌ వాటర్‌ ప్రైవేటు సైన్యం..!

ప్రైవేటు సైన్యం విషయంలో అమెరికా కూడా తక్కువేమీ తినలేదు. ఇక్కడ ప్రైవేటు సైన్యం నిర్వహణ చట్టబద్ధం. అమెరికాకు చెందిన బ్లాక్‌ వాటార్స్ అనే కిరాయి సైన్యం అఫ్గానిస్థాన్‌లో అరాచకం సృష్టించింది. మాజీ నేవీ సీల్‌, వ్యాపారవేత్త ఎరిక్‌ ప్రిన్స్‌ , మరో మాజీ నేవీ సీల్‌ ఇన్‌స్ట్రక్టర్‌ అల్‌ క్లార్క్‌లు దీనిని ప్రారంభించారు. 1997లోనే దీనిని ప్రారంభించారు. 2007లో బ్లాక్‌ వాటర్‌ కాంట్రాక్టర్లు ఇరాక్‌లోని బాగ్దాద్‌లో గల నిసర్‌ స్క్వేర్‌లో 17 మంది అమాయకపు ఇరాకీలను హత్య చేశారు. దీంతో ఇరాక్‌ వీరి లైసెన్స్‌ను రద్దు చేసింది. 2014లో ఈ బ్లాక్‌ వాటర్స్‌ను అమెరికాకు చెందిన మరో సెక్యూరిటీ కంపెనీ ట్రిపుల్‌ కాన్పేలో విలీనం చేశారు.

ఇదీ చదవండి: 'రష్యా జవాన్ల తల్లుల్లారా.. కీవ్​కు వచ్చి మీ బిడ్డల్ని విడిపించుకుని వెళ్లండి'

రష్యా వద్ద వేల అణు బాంబులు.. ప్రయోగిస్తే జరిగే నష్టం...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.