ETV Bharat / international

రష్యా ఇంధనంపై ఆధారపడకూడదని ఈయూ నిర్ణయం! - Russia Invasion on Ukriane

Ukraine Crisis: రష్యా గ్యాస్, చమురు, బొగ్గుపై ఆధారపడటాన్ని యూరోపియన్ దేశాలు దశలవారీగా తగ్గించడానికి ఈయూ నిర్ణయించింది. మే చివరి నాటికి దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని తెలిపింది.

Ukraine Crisis
ఉక్రెయిన్
author img

By

Published : Mar 12, 2022, 8:51 AM IST

Ukraine Crisis: 2027 నాటికి రష్యా గ్యాస్, చమురు, బొగ్గుపై ఆధారపడటాన్ని యూరోపియన్ దేశాలు తగ్గించడానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. మే చివరి నాటికి దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించనున్నట్లు ఈయూ తెలిపింది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ మేరకు ట్వీట్​ చేశారు.

"రష్యా గ్యాస్, చమురు, బొగ్గుపై ఆధారపడడాన్ని 2027 నాటికి దశలవారీగా తగ్గించాలని ప్రతిపాదన తీసుకొస్తున్నాము. ఇందుకు యూరోపియన్ దేశాల్లోని వనరులపై ఆధారపడాల్సి ఉంటుంది." అని చెప్పారు.

యుద్ధంలో ఉక్రెయిన్ కోసం ఈయూ ఆర్థిక సహాయాన్ని ఇప్పటికే ప్రకటించింది. మొదటి విడతగా 300 యూరోల మిలియన్లను పంపిణీ చేసింది. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు మద్దతుగా 1.2 బిలియన్​ యూరోల ప్యాకేజీని కేటాయించింది.

ఇదీ చదవండి: వార్​ 2.0.. గేర్​ మార్చిన పుతిన్.. ఇక విదేశీ ఫైటర్లతో ఉక్రెయిన్​పై దాడులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.