డ్రాగన్ దేశం చైనాపై లేకిమా తుపాను విలయతాండవం చేసింది. భారీ వర్షాలకు మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 49 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మంది ఆచూకీ లేదు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. ముంపునకు గురైన ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది.
ప్రధానంగా జెజియాంగ్, షాందాంగ్, అన్హుయ్ రాష్ట్రాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. వరద ఉద్ధృతికి ఎత్తైన భవనాలు నేలమట్టమయ్యాయి.
జెజియాంగ్ రాష్ట్రంలో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. గంటకు 190 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. "షాందాంగ్లో 1952 తర్వాత ఇప్పుడే అత్యధిక వర్షపాతం నమోదైందని" అధికారులు తెలిపారు. ప్రకృతి విపత్తు కారణంగా 26 బిలియన్ యువాన్లు (3.7 బిలియన్ డాలర్ల) ఆస్తి నష్టం వాటిల్లింది.
ఇదీ చూడండి:పాక్‌ను ముంచెత్తిన వరదలు..28 మంది మృతి.