కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. తాజాగా ఈ విషయంపై పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషి స్పందించారు. అగ్రరాజ్యం అధ్యక్షుడి నుంచి ఇంతకంటే ఎక్కువగా తాము ఏమీ ఆశించలేదని చెప్పారు ఖురేషి. పాక్‌లోని ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పాకిస్థాన్‌కు ఊహించని ఆఫర్ ఇచ్చారన్నారు.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్... ట్రంప్ ప్రకటనను స్వాగతించారు. కానీ ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. అమెరికాలోనూ ట్రంప్ వ్యాఖ్యలపై విమర్శలు ఎదురయ్యాయి.
ఇదీ చూడండి: అఫ్గాన్ ఉపాధ్యక్ష అభ్యర్థి లక్ష్యంగా బాంబు దాడి