ETV Bharat / international

చైనాలో 3,189కు చేరిన కరోనా మరణాలు

చైనాలో కరోనా ధాటికి మరో 13మంది మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 3,189కు చేరినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. వెనిజువెలా, ఉరుగ్వే, గ్వాటిమాలాలో తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. ఈక్వెడార్​లో తొలి కరోనా మరణం సంభవించింది.

Trudeau, in quarantine, telegoverns Canada
చైనాలో 3,189కు చేరిన కరోనా మరణాలు
author img

By

Published : Mar 14, 2020, 12:57 PM IST

కరోనా వైరస్​ ప్రపంచవ్యాప్తంగా అంతకంతకు విస్తరిస్తోంది. తాజాగా లాటిన్ అమెరికా దేశాలకు ఈ మహమ్మారి వ్యాపించింది. అయితే వైరస్ పుట్టిన చైనాలో మాత్రం ఉద్ధృతి రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. శుక్రవారం 13 మంది మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మృతి చెందిన వారంతా హుబే ప్రాంతానికి చెందిన వారే. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,189కు చేరుకుంది. కొత్తగా మరో 11 మందికి వైరస్​ సోకినట్లు చైనా అధికారులు వెల్లడించారు.

వెనిజువెలా, ఉరుగ్వేలో తొలి కేసులు..

హాంకాంగ్​లో 137, మకావులో 10, తైవాన్​లో 50మంది కరోనా బారిన పడ్డారు. వెనిజువెలా, ఉరుగ్వే, గ్వాటిమాలా, సురినామ్​ దేశాల్లో తొలి కేసులు నమోదయ్యాయి. ఈక్వెడార్​లో తొలి కరోనా మరణం సంభవించగా..అర్జెంటీనాలో ఇప్పటి వరకు ఇద్దరు మృతిచెందారు.

వైరస్​ విజృంభణ నేపథ్యంలో ఆంక్షలు విధించాయి పలు దేశాలు. చిలీ, మెక్సికో ఎక్కువ మంది ఒకే చోట గుమికూడవద్దని ఆదేశించాయి. రియోలో సినిమా హాళ్లు, పాఠశాలలు, ఆటల ప్రాంగణాలు, సంగీత కచేరీలను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

కెనడాలో...

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కెనడా పార్లమెంట్ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. తన భార్యకు వైరస్​ సోకిన కారణంగా స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇంటి నుంచే విధుల్ని నిర్వర్తించనున్నట్లు వెల్లడించారు ట్రూడో.

కెనడాలో ఇప్పటి వరకు 138 మందికి కరోనా వైరస్ సోకినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:'మోదీజీ.. మాస్క్​ల ఎగుమతులకు అనుమతినివ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.