అఫ్గానిస్థాన్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చిన తాలిబన్లతో (Pakistan meeting on Afghanistan) అంతర్జాతీయ సమాజం సంప్రదింపులు కొనసాగించాలని (Troika Plus meeting) పాకిస్థాన్ పిలుపునిచ్చింది. అఫ్గాన్‌లో శాంతి, సుస్థిరతను నెలకొల్పడం సహా.. సుస్థిరాభివృద్ధి సాధించేందుకు ఆ దేశంతో జరిపే చర్చలు ఉపకరిస్తాయని పేర్కొంది. అమెరికా, చైనా, రష్యా దేశాల ప్రతినిధులతో కలిసి అఫ్గాన్ అంశంపై చర్చలు (Pakistan meeting on Afghanistan) ప్రారంభించడానికి ముందు పాకిస్థాన్ ఈ మేరకు సందేశాన్ని ఇచ్చింది.
"అంతర్యుద్ధం తిరిగి రావాలని ఎవరూ కోరుకోరు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఎవరికీ అవసరం లేదు. సరికొత్త శరణార్థుల సంక్షోభాన్ని మనం నివారించాలని కోరుకుంటున్నాం. ప్రాంతీయ దేశాలన్నింటికీ అఫ్గాన్ సమస్యపై ఆందోళన ఉంది. ఆ దేశంలో శాంతి, సుస్థిరత విషయంపై ఒకే విధమైన ఆలోచనలు ఉన్నాయి."
-షా మహమ్మద్ ఖురేషీ, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి
అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాద సమస్యను సమర్థంగా పరిష్కరించాలని పేర్కొన్నారు ఖురేషీ. పొరుగు దేశంగా.. నాలుగు దశాబ్దాల పాటు సంక్షోభం, అస్థిరత తాలూకు మంటలను తాము అనుభవించామని అన్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగిన సంఘర్షణను ముగించేందుకు ప్రస్తుత పరిస్థితులను ఓ అవకాశంగా అభివర్ణించారు.
ఖురేషి అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి తాలిబన్ ప్రభుత్వ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాకీ నేతృత్వంలోని బృందం సైతం హాజరైంది. అమెరికా తరపున హాజరైన థామస్ వెస్ట్ సహా ఇతర దేశాల ప్రతినిధులు సైతం.. ముత్తాకీతో భేటీ కానున్నారు.
ఇదీ చదవండి: