ETV Bharat / international

కరోనా ఎఫెక్ట్​: పర్యటకం బంద్​.. సమావేశాలు వాయిదా - కరోనా ఎఫెక్ట్

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరిగిపోతున్న నేపథ్యంలో అనేక దేశాలు విదేశీ పర్యటకులను తమ దేశంలోకి అనుమతించకూడదని ఆలోచిస్తున్నాయి. అలాగే కీలకమైన అంతర్జాతీయ, ప్రాంతీయ సమావేశాలను వాయిదా వేయడమో, నిలిపివేయడమో చేస్తున్నాయి.

Tourism, diplomacy facing pushback as virus caseloads surge
పర్యాటకం, అంతర్జాతీయ సమావేశాలపై కరోనా ఎఫెక్ట్
author img

By

Published : Jul 27, 2020, 2:03 PM IST

Updated : Jul 27, 2020, 4:00 PM IST

కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న వేళ... అనేక దేశాలు విదేశీ పర్యటకులను దూరంగా ఉంచాలని ఆలోచిస్తున్నాయి. మరోవైపు ప్రాంతీయ సమావేశాలను కూడా నిలిపివేస్తున్నాయి.

వైరస్ ఉద్ధృతి ఉన్నా...

కరోనా సమాజిక వ్యాప్తిని అరికట్టేందుకు మెల్​బోర్న్​లో ఆరువారాల పాటు లాక్​డౌన్ విధించారు. అయినప్పటికీ.. సోమవారం కొత్తగా 532 కేసులు నమోదయ్యాయి.

"ఆస్ట్రేలియాలో కొవిడ్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నప్పటికీ.... ప్రజలు పనులకు వెళుతున్నారు. వారు కనీసం కరోనా నిర్ధరణ పరీక్షలు చేసుకోవడం లేదు. అందువల్ల కరోనా వ్యాప్తి బాగా పెరిగిపోతోంది."

- డేనియల్ ఆండ్రూస్, విక్టోరియా స్టేట్ ప్రీమియర్

పర్యాటకంపైనా ఎఫెక్ట్​...

ఆసియా- పసిఫిక్​ ప్రాంతంలో కరోనా ధాటికి బాగా దెబ్బతిన్న దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. అందువల్ల విదేశీ ప్రయాణికులను దేశంలోకి రాకుండా నిషేధం విధించింది. ఒకవేళ ఎవరినైనా అనుమతించినా కరోనా నిర్ధరణ పరీక్షలు చేసుకుని, కఠిన క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

అంతర్జాతీయ విమాన సేవల పునరుద్ధరణ

కొన్ని దేశాలు పరిమితంగా అంతర్జాతీయ విమాన సేవలు పునరుద్ధరించాలని భావిస్తున్నాయి. అయితే దీని వల్ల కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

హెచ్చరిక.. అక్కడకు వెళ్లొద్దు...

చాలా యూరోపియన్ దేశాలు తమ పౌరులను.. స్పెయిన్​కు వెళ్లవద్దని హెచ్చరించాయి. వేసవి విడిది అయిన స్పెయిన్.. నేడు కరోనా విలయానికి నిలయం కావడమే ఇందుకు కారణం. అయితే.. ఒక నెలక్రితమే అక్కడ లాక్​డౌన్ నిబంధనలను సడలించారు.

కీలక సమావేశాలు వాయిదా...

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కీలక అంతర్జాతీయ సమావేశాలు... ఆన్​లైన్​కు మారాయి. అయినప్పటికీ కరోనా భయాలు మాత్రం తొలగిపోవడం లేదు. అందుకే వచ్చేవారం తమ దేశంలో జరగాల్సిన ఆగ్నేయాసియా విదేశాంగ మంత్రుల వార్షిక సమావేశాన్ని సెప్టెంబర్​ వరకు వాయిదా వేసింది వియత్నాం.

విదేశాల నుంచి కరోనాను తీసుకొస్తున్నారు..

దక్షిణ కొరియాలో కొత్తగా 25 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 16 కేసులు విదేశాల నుంచి వచ్చినవేనని అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం తమ దేశంలోని బుసాన్ తీరానికి వచ్చిన... రష్యా కార్గో షిప్​ సిబ్బందిలో డజన్ల మందికి కరోనా పాజిటివ్​గా తేలిందని వారు తెలిపారు. అలాగే ఇరాక్​ నుంచి వచ్చిన కొరియా భవన నిర్మాణ కార్మికులు కూడా కొవిడ్ బారిన పడ్డారని అధికారులు వెల్లడించారు.

సింగపూర్ - న్యూజిలాండ్ - దక్షిణ కొరియా

ఇటీవల ఓ వ్యక్తి న్యూజిలాండ్ నుంచి దక్షిణ కొరియాకు వచ్చాడు. అతనికి కరోనా పాజిటివ్​గా తేలింది. దీనితో అప్రమత్తమైన న్యూజిలాండ్ అతనితో సంబంధమున్న వారిందరికీ కొవిడ్​ టెస్టులు చేయించింది. అలాగే తమ దర్యాప్తులో దక్షిణ కొరియా ప్రయాణికుడు సింగపూర్​ వెళ్లినపుడు కరోనా బారిన పడినట్లు తేలిందని వెల్లడించింది.

విజృంభణ కొనసాగుతోంది...

జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం, కరోనా వైరస్ వ్యాప్తి మరింత తీవ్రంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటీ 64 లక్షల మంది కొవిడ్ బారినపడగా... 6లక్షల 52వేల మందికిపైగా మరణించారు. అయితే కోటి మందికిపైగా వైరస్​ను జయించడం కాస్త ఊరటనిచ్చే విషయం.

ఇదీ చూడండి: చెంగ్డూలోని కాన్సులేట్​ను మూసేసిన అమెరికా

Last Updated : Jul 27, 2020, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.