అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతమే లక్ష్యంగా ఏర్పాటు చేసే భద్రతా మండలి సమావేశం త్వరలో జరగనుంది. ఇందులో చైనా, అమెరికా, రష్యా అధికారులు తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. భద్రతా మండలికి మే నెలలో నేతృత్వం వహిస్తున్న చైనా.. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. బహుళపక్ష విధానాలకు కట్టుబడి ఉంటాయని భద్రతా మండలిలోని 15 దేశాలు కట్టుబడి ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపింది.
వర్చువల్‌గా జరిగే ఈ సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అధ్యక్షత వహించనున్నారు. అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు ఆంటోనీ బ్లింకెన్, సెర్గీ లావ్రోవ్లు ఇందులో భాగం కానున్నారు. ఈ ముగ్గురు కలిసి ఒకే వేదిక పంచుకోవడం ఇదే తొలిసారి కానుంది.
ఈ భేటీకి బ్లింకెన్ హాజరయ్యే విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. బహుళపక్ష సహకారం ప్రాముఖ్యతపై ఆయన మాట్లాడతారని తెలిపింది.
ఇదీ చదవండి: 'కొవిడ్‌పై పోరులో సాయం కోసం వారిని అనుమతించండి'