ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ దేశ పౌరులు. మానవ హక్కుల కార్యకర్తలకు వ్యతిరేకంగా ఉన్న ఉగ్రవాద నిరోధక చట్టంపై ఆ దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే సంతకం చేసిన నేపథ్యంలో ఆందోళనలు చేపట్టారు.
దేశంలోనే అతిపెద్ద వార్తా ఛానెల్ లైసెన్స్ పునరుద్ధరణను తిరస్కరించడాన్ని ఖండించారు నిరసనకారులు. కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో అధిక సంఖ్యలో కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రోడ్డులపైకి వచ్చి... ప్లకాార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసనలను తెలియజేశారు.
![Thousands gather for protest in Philippines](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8188249_3.jpg)
![Thousands gather for protest in Philippines](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8188249_2.jpg)
ఇదీ చూడండి: చెంగ్డూలోని కాన్సులేట్‌ను మూసేసిన అమెరికా