ETV Bharat / international

తాలిబన్ల​ గుండెల్లో 'ఇస్లామిక్​ స్టేట్​' గుబులు!

ఇస్లామిక్​ స్టేట్​.. ఇప్పుడు ఈ పేరు వింటుంటే తాలిబన్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి(taliban isis news). తాలిబన్ల​ వాహనాలు, ఫైటర్లే లక్ష్యంగా బాంబు దాడులతో విరుచుకుపడుతోంది ఐఎస్​(taliban isis difference). ఆర్థిక సంక్షోభం, భద్రతా సమస్యలతో అల్లాడుతున్న తాలిబన్లకు ఇస్లామిక్​ స్టేట్​ తలనొప్పి వ్యవహారంగా మారింది.

The Latest: Islamic State militants claim attacks on Taliban
ఐఎస్​ తాలిబన్​
author img

By

Published : Sep 20, 2021, 3:11 PM IST

అఫ్గాన్​ను గడగడలాడించే తాలిబన్లు.. ఇస్లామిక్​ స్టేట్​ పేరు వింటేనే వణికిపోతున్నారు!(taliban isis news) వరుస బాంబు దాడులతో తాలిబన్లకు తలనొప్పిగా మారింది ఇస్లామిక్​ స్టేట్​. ముఖ్యంగా తాలిబన్లే లక్ష్యంగా వారి వాహనాలపై దాడులకు తెగబడుతోంది(taliban isis difference).

తూర్పు అఫ్గానిస్థాన్​లోని జలాలాబాద్​లో శని, ఆదివారాల్లో తాలిబన్​ వాహనాలే లక్ష్యంగా దాడులు జరిగాయి(islamic state afghanistan). ఇందులో 8 మంది మరణించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని.. ఇస్లామిక్​ స్టేట్​ బృందం తన అధికార మీడియా ఆమక్​ న్యూస్​ ద్వారా ప్రకటించింది.

అనాదిగా.. శత్రుత్వం!

తాలిబన్​- ఇస్లామిక్​ స్టేట్​ మధ్య శత్రుత్వం కొత్తేమీ కాదు. అమెరికా దళాలు వెనుదిరగక ముందు నుంచే వీరి మధ్య వైర్యం ఉంది. రెండు వర్గాలు కఠిన ఇస్లాం నిబంధనలు పాటిస్తాయి. కానీ వీరి సిద్ధాంతాల్లో కొంత వ్యత్యాసం ఉంది. అఫ్గానిస్థాన్​పై పట్టు కోసం తాలిబన్లు ఇన్నేళ్లు శ్రమించగా.. అంతర్జాతీయంగా 'జిహాద్​' కోసం ఐఎస్​ పిలుపునిచ్చింది.

ఇదీ చూడండి:- kabul airport blast: కాబుల్​ 'బాంబర్​'.. దిల్లీలో భారీ పేలుళ్లకు స్కెచ్​!

అమెరికా, నాటో దళాలు వెనుదిరగక ముందే.. గత నెలలో మెరుపు వేగంతో కాబుల్​ను ఆక్రమించుకున్నారు తాలిబన్లు(taliban afghan was). దేశాన్ని వీడేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్న సమయంలో కాబుల్​ విమానాశ్రయం వద్ద పేలుళ్లకు పాల్పడింది ఐసిస్​-కే. ఈ ఘటనలో అమాయక ప్రజలు, తాలిబన్​ ఫైటర్లు, అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ పరిణామాలతో.. అప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది(afghan taliban news). దేశం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, భద్రత సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలో వాటిని మరింత పెంచే విధంగా తాలిబన్​ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతోంది ఇస్లామిక్​ స్టేట్​.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.