కరోనా బాధితుల కోసం చైనా ప్రభుత్వం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ 10 రోజుల్లోనే 1000 పడకల ఆసుపత్రిని నిర్మించింది. నేడే ఇక్కడ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. 1500 పడకల సదుపాయం కలిగిన మరొక ఆసుపత్రిని ఈ వారంలోనే తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆసుపత్రికి 1400 మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని ఆర్మీ విభాగం నుంచి వుహాన్ పంపనున్నట్లు వెల్లడించింది అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. అవసరమైన విద్యుత్ పరికరాలు, వెంటిలేషన్, ఆక్సిజన్ సరఫరా వ్యవస్థలు, ఇతర పరికరాలు ఏర్పాటు చేయటం పూర్తయిందని స్పష్టం చేసింది.
వుహాన్ అంతర్జాతీయ ప్రదర్శన కేంద్రాన్ని... 1800 పడకలతో కూడిన అత్యవసర ఆసుపత్రిగా మార్చినట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రానికి అన్ని రకాలైన వైద్య పరికరాలు, గదులను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక ఆసుపత్రుల్లో కృత్రమ మేధతో నడిచే యంత్రాలను వినియోగించనున్నారు.
కరోనా ధాటికి ఇప్పటి వరకు చైనాలో 425 మంది మరణించారు. మరో 20 వేల 400 మందికి పైగా ఈ వైరస్ సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇదే విధంగా ప్రపంచవ్యాప్తంగానూ కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. ఆయా దేశాలు సంబంధిత జాబితాలను విడుదల చేశాయి. భారత్‌లోనూ ముగ్గురికి కరోనా సోకింది.
ఆసియా- పసిఫిక్ దేశాల్లో....
దేశం | నమోదైన కేసులు |
సింగపూర్ | 24 |
జపాన్ | 20 |
థాయిలాండ్ | 19 |
హాంకాంగ్ | 17 (చనిపోయిన వ్యక్తితో కలిపి) |
దక్షిణ కొరియా | 16 |
ఆస్ట్రేలియా | 12 |
మలేసియా | 10 |
తైవాన్ | 10 |
వియత్నాం | 10 |
మకావు | 9 |
భారత్ | 3 |
ఫిలిప్పైన్స్ | 2 ( చనిపోయిన వ్యక్తితో కలిపి) |
నేపాల్ | 1 |
శ్రీలంక | 3 |
కాంబోడియా | 1 |
ఉత్తర అమెరికా దేశాల్లో...
దేశాలు | నమోదైన కేసులు |
అమెరికా | 11 |
కెనడా | 4 |
జర్మనీ | 12 |
ఫ్రాన్స్ | 6 |
బ్రిటన్ | 2 |
ఇటలీ | 2 |
రష్యా | 2 |
ఫిన్లాండ్ | 1 |
స్పెయిన్ | 1 |
స్వీడన్ | 1 |
పశ్చిమాసియా దేశాల్లో...
యూఏఈలో 5 కేసులు నమోదైనట్లు ఆ దేశాధికారులు ప్రకటించారు.