ETV Bharat / international

చైనాలో తాత్కాలిక ఆస్పత్రుల సేవలపై ప్రశంసలు - Caronavirus

కరోనా వైరస్​ విజృంభిస్తున్న వేళ.. కేవలం 10రోజుల్లో వుహాన్​లో వేయి పడకల ఆస్పత్రిని నిర్మించింది చైనా. దీనితో ప్రపంచానికి తన శ్రామిక శక్తిని తెలియజేసింది. అనేక మంది ప్రజలు వైరస్​ బారిన పడకుండా మరిన్నింటిని నిర్మిస్తోంది. అయితే మొదట ఏర్పాటు చేసిన ఆస్పత్రిపై వుహన్​ తాత్కాలిక ఆస్పత్రి డైరెక్టర్​ ప్రశంసల వర్షం కురిపించారు.

The director of a makeshift Wuhan hospital on praised the facility for making a "big difference" at a time
కరోనా: చైనాలో తాత్కాలిక ఆస్పత్రుల సేవలపై ప్రశంసలు
author img

By

Published : Mar 2, 2020, 4:54 PM IST

Updated : Mar 3, 2020, 4:23 AM IST

చైనాలో తాత్కాలిక ఆస్పత్రుల సేవలపై ప్రశంసలు

కరోనా వైరస్​ పంజా విసురుతున్న నేపథ్యంలో కేవలం పదిరోజుల్లోనే వుహాన్​లో​ వెయ్యి పడకల తాత్కాలిక ఆస్పత్రి నిర్మించి ప్రపంచాన్ని అబ్బురపరిచింది చైనా. అత్యాధునిక వైద్య సదుపాయాలతో.. నదీ ప్రవాహంలా వచ్చే రోగులకు అందులో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే ఇక్కడి వైద్య సిబ్బంది అత్యంత జాగ్రత్తగా.. తమకు వైరస్​ సోకకుండా చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి సిబ్బందిని వుహాన్​ తాత్కాలిక ఆస్పత్రి డైరెక్టర్​ జాంగ్​ జుంజియాన్​ ప్రశంసలతో ముంచెత్తారు.

ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య కొంత తగ్గుముఖం పట్టిందని, ఈ పరిస్థితి ఈనెల చివరి నాటికి పూర్తిగా తగ్గుతుందని అశాభావం వ్యక్తం చేశారు జుంజియాన్.

ప్రస్తుతం వుహాన్​లో 13 తాత్కాలిక ఆస్పత్రుల్లో 13,348 పడకలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని నెలల పాటు కరోనా వేగంగా విజృంభించిన సందర్భంలో... మైదానాలు, కాన్ఫరెన్స్​ కేంద్రాలను కూడా ఆస్పత్రులుగా మార్చివేశారు.

ఇదీ చూడండి: వుహాన్​కు 4వేల మంది సైనిక వైద్య సిబ్బంది

Last Updated : Mar 3, 2020, 4:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.