ETV Bharat / international

taliban news:'ఆ విషయంలో ఎవరి జోక్యాన్ని అనుమతించం' - ఐఎస్​ఐ తాజా వార్తలు

తమ దేశ అంతర్గత విషయాల్లో పాకిస్థాన్‌తో పాటు ఏ ఇతర దేశాల జోక్యాన్నీ కూడా తాము అనుమతించబోమని తాలిబన్లు (taliban news) తేల్చి చెప్పారు. తాలిబన్‌ అధినేతను పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ చీఫ్‌ కలిశారన్న మాటను ఆమోదించిన వారు.. అఫ్గాన్‌ ప్రభుత్వ ఏర్పాటులో పాక్​ ప్రమోయం ఏమీ ఉండబోదని స్పష్టం చేశారు.

taliban news
తాలిబన్​ న్యూస్​
author img

By

Published : Sep 7, 2021, 5:06 AM IST

Updated : Sep 7, 2021, 6:11 AM IST

అఫ్గానిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్థాన్‌తో పాటు ఏ ఇతర దేశాల జోక్యాన్నీ అనుమతించబోమని తాలిబన్లు(taliban news) స్పష్టం చేశారు. తాలిబన్‌ అధినేతను పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ చీఫ్‌ కలిశారన్న మాట వాస్తవమేనని ధ్రువీకరించారు. అయితే, అఫ్గాన్‌ ప్రభుత్వ ఏర్పాటులో పాకిస్థాన్‌ ప్రధాన పాత్ర పోషిస్తోందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో తాలిబన్లు ఈ విధంగా స్పందించారు.

తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత పాకిస్థాన్‌ ఇంటర్‌-సర్వీసెన్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ హమీద్‌ అఫ్గానిస్థాన్‌ వెళ్లారనే వార్తలు వచ్చాయి. అక్కడ అఫ్గాన్‌ ప్రభుత్వానికి నేతృత్వం వహించనున్న తాలిబన్‌ నాయకుడు ముల్లా అబ్దుల్‌ బరాదర్‌ను ఐఎస్‌ఐ చీఫ్‌ కలిసినట్లు తెలిసింది. తాజాగా దీనిపై స్పందించిన తాలిబన్లు.. బరాదర్‌ను ఐఎస్‌ఐ చీఫ్‌ కలిసిన మాట వాస్తవమేనన్నారు. కేవలం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో భాగంగానే పాక్‌ నిఘా విభాగాధిపతి తమ అగ్రనేతతో భేటీ అయినట్లు తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ వెల్లడించారు. అఫ్గాన్‌ ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల్లో మాత్రం పాకిస్థాన్‌తో పాటు ఏ ఇతర దేశాల జోక్యాన్నీ అనుమతించబోమని స్పష్టం చేశారు. అయితే, తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత ఓ అత్యున్నత ర్యాంకు అధికారి వారితో కలవడం అదే తొలిసారి.

ఇదిలా ఉండగా.. అఫ్గానిస్థాన్‌లో సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాలిబన్లు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించి వివిధ వర్గాలతో ఇప్పటికే సంప్రదింపులు జరపగా.. తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, వారి ప్రభుత్వానికి అంతర్జాతీయ సమాజం ఆమోదముద్ర వేస్తుందా లేదా అనే సంశయంలోనే తాలిబన్లు ఉన్నట్లు సమాచారం. అందుకే ప్రభుత్వ ఏర్పాటు ప్రకటనపై మల్లగుల్లాలు పడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి: పంజ్​షేర్ పరిస్థితి ఏంటి? చేసిందంతా పాకిస్థానేనా?

Last Updated : Sep 7, 2021, 6:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.