అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి దాడికి తెగబడ్డారు. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ గుర్తింపు నమోదు కేంద్రంలో చొరబడిన ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా దళాలు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
సెప్టెంబర్ 28న జరగనున్న ఎన్నికల కోసం.. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ చేస్తున్న ప్రచారానికి అంతరాయం కలిగించాలనే లక్ష్యంతోనే తాలిబన్ మూకలు ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం చేసిన దాడిలో 48 మందిని పొట్టన పెట్టుకున్నారు.
అమెరికాతో అర్ధంతరంగా చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో దాడులను ముమ్మరం చేస్తామని ప్రకటించారు తాలిబన్లు. అఫ్గాన్‌లో అగ్రరాజ్యం సేనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి : రికార్డు సృష్టించాలనుకుని తిరిగిరాని లోకాలకు..!