ETV Bharat / international

నిరసనలు ఆపేయండి.. పౌరులకు తాలిబన్ల హుకుం

దేశంలో నిరసనలన్నింటినీ ఆపేయాలని (afghanistan protests) పౌరులకు తాలిబన్ ప్రభుత్వం (Taliban government) హెచ్చరికలు జారీ చేసింది. అనుమతి లేకుండా బ్యానర్ల ప్రదర్శన సైతం చేపట్టకూడదని స్పష్టం చేసింది. మరోవైపు, అఫ్గాన్ ప్రజలను వదిలివెళ్లాలని అనుకోవడం తన అభిమతం కాదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ (Ashraf Ghani) పేర్కొన్నారు. నోట్ల కట్టలతో వెళ్లారన్న ఆరోపణలను ఖండించారు.

afghanistan protests
నిరసనలు ఆపేయండి.. పౌరులకు తాలిబన్ల హుకుం
author img

By

Published : Sep 9, 2021, 10:54 AM IST

అఫ్గానిస్థాన్​లో నిరసన చేస్తున్న పౌరులపై (Afghan protest) ఉక్కుపాదం మోపే దిశగా తాలిబన్లు పావులు కదిపారు. తమ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై చర్యలు చేపట్టారు. ఈ మేరకు తాలిబన్ కొత్త ప్రభుత్వం (Taliban government) హుకుం జారీ చేసింది.

దేశంలోని నిరసనలన్నింటినీ ఆపేయాలని అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ఆదేశించింది. ముందస్తు అనుమతి లేనిదే నిరసనలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. నినాదాలతో పాటు బ్యానర్ల ప్రదర్శనకు సైతం తమ అనుమతి తీసుకోవాలని తేల్చిచెప్పింది. కారణం ఏదైనా.. ఏ రకమైన ఆందోళనలు నిర్వహించకూడదని ఉత్తర్వుల్లో తెలిపింది.

ఆగని నిరసన

అయితే, తాలిబన్ల పాలనను వ్యతిరేకిస్తూ కాబుల్​లో పౌరులు మాత్రం నిరసనలు కొనసాగిస్తున్నారు. మహిళలు సైతం ముందుండి పోరాటం చేస్తున్నారు. ప్లకార్డులు చేతబూని 'దుష్టశక్తుల'కు వ్యతిరేకంగా (women protest in Afghanistan) పోరాడుతున్నారు. విద్య, ఉద్యోగం తదితర రంగాల్లో హక్కుల సాధన కోసం గళమెత్తుతున్నారు. దేశంలో కొత్తగా కొలువుదీరనున్న తాలిబన్ల ప్రభుత్వంలో తమకూ భాగస్వామ్యం కల్పించాలంటూ పోరాడుతున్నారు.

తాలిబన్లు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నప్పటికీ వెనుకడుగు వేయడం లేదు. శనివారం.. ఇస్లామాబాద్‌, ఐఎస్‌ఐకి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో కాబుల్‌ నగరం (women protest in kabul) మార్మోగిపోయింది. దీంతో ఆ నిరసన కార్యక్రమాలపై తాలిబన్లు విరుచుకుపడ్డారు. వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ వారు వెనుదిరగలేదు. కొద్దిసేపటికే మళ్లీ తన నిరసనలను కొనసాగించారు.

ఇదీ చదవండి: Afghanistan news: 'ఏం చేస్తావ్‌? చంపుతావా? ఏదీ చంపు'

'అది జీవితంలోనే కఠిన నిర్ణయం'

మరోవైపు, అఫ్గాన్​ నుంచి పారిపోవడాన్ని మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ (Ashraf Ghani) సమర్థించుకున్నారు. కాబుల్​లో రక్తపాతం సృష్టించకూడదన్న ఉద్దేశంతోనే దేశం విడిచి వెళ్లానని చెప్పారు. అఫ్గాన్ ప్రజలను వదిలిపెట్టాలని తాను ఎన్నడూ భావించలేదని అన్నారు.

ashraf ghani
అష్రఫ్ ఘనీ, అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు

"నా భద్రతా బృందాల అభ్యర్థన మేరకే నేను దేశం విడిచిపెట్టాను. నా జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయం ఇదే. కాబుల్​ను, అక్కడ ఉన్న 60 లక్షల మంది పౌరులను కాపాడేందుకు ఇదే సరైనదని అనిపించింది. అఫ్గాన్ ప్రజల కోసం ప్రజాస్వామ్య, సుసంపన్న, సార్వభౌమ దేశాన్ని నిర్మించేందుకు నా జీవితంలో 20 ఏళ్ల పాటు కృషి చేశాను. ఈ విజన్​ను, నా దేశ ప్రజలను విడిచిపెట్టాలన్నది నా అభిమతం కాదు."

-అష్రఫ్ ఘనీ, అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు

హెలికాప్టర్ నిండా డబ్బుతో పారిపోయారని వచ్చిన ఆరోపణలు.. పూర్తిగా అవాస్తమని అన్నారు ఘనీ. తన ఆస్తిపాస్తుల వివరాలన్నీ ప్రజల ముందున్నాయని చెప్పారు. ఈ విషయంపై ఐరాస లేదా ఇతర సంస్థల ఆధ్వర్యంలో స్వతంత్ర దర్యాప్తునకు సిద్ధమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: తాలిబన్​ సర్కార్​కు గుర్తింపుపై అన్ని దేశాలదీ అదే కన్ఫ్యూజన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.