ETV Bharat / international

అమెరికాకు తాలిబన్ల వార్నింగ్​.. డెడ్​లైన్​ ఫిక్స్​ - తాలిబన్లు

అఫ్గానిస్థాన్​ నుంచి బలగాలు, ఇతర వ్యక్తుల తరలింపు ప్రక్రియను అమెరికా ఆగస్టు 31లోగా పూర్తి చేయాల్సిందేనని తాలిబన్లు(taliban news) తేల్చిచెప్పారు. గడువు పొడిగించాలని అగ్రరాజ్యం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో ఈమేరకు ప్రకటన చేశారు.

taliban
తాలిబన్​
author img

By

Published : Aug 24, 2021, 7:29 PM IST

అఫ్గానిస్థాన్​ నుంచి బలగాలు, ఇతర ప్రజల్ని తరలించే ప్రక్రియను ఈనెల 31లోగా పూర్తిచేయాల్సిందేనని అమెరికాకు తేల్చిచెప్పారు తాలిబన్లు. ఈ గడువును పొడిగించే అవకాశాలు ఏమాత్రం లేవని స్పష్టం చేశారు(us military in afghanistan). తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఈమేరకు ఓ ప్రకటన చేశాడు. అఫ్గానిస్థాన్​లో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటున్నా.. విమానాశ్రయంలో మాత్రం గందరగోళ పరిస్థితులు ఉన్నాయని అన్నాడు(taliban news).

బలగాలు, ప్రజల తరలింపునకు గడువు పొడిగింపుపై తాలిబన్లకు, అమెరికా సీఐఏ ఉన్నతాధికారులకు మధ్య చర్చలు జరిగాయన్న వార్తలపై జబీహుల్లా స్పష్టత ఇవ్వలేదు. ఆ సమావేశం గురించి తనకు తెలియదని చెప్పాడు. అయితే భేటీ జరిగిందన్న వార్తలను మాత్రం ఖండించలేదు.

వారిని తీసుకెళ్లొద్దు

ప్రతిభావంతులు, నైపుణ్యంగల అఫ్గాన్​లను తీసుకెళ్లొద్దని అమెరికాకు(us taliban latest news) సూచించాడు జబీహుల్లా. పంజ్​షేర్ వ్యవహారాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు తాలిబన్లు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశాడు.

ఇదీ చూడండి:- భయపడినట్టే అయింది.. ఆ విమానాల్లో విదేశాలకు తాలిబన్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.