ETV Bharat / international

Afghan taliban: తాలిబన్​ ప్రభుత్వ ఏర్పాటు మరోమారు వాయిదా! - తాలిబన్​ న్యూస్​

అఫ్గానిస్థాన్​లో ప్రభుత్వ ఏర్పాటుపై(Afghan govt formation) ప్రకటనను మరోమారు వాయిదా వేశారు తాలిబన్లు(Afghan taliban). అంతర్జాతీయ సమాజం ఆమోదం పొందేలా విస్తృతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, అందుకోసమే జాప్యం జరుగుతున్నట్లు తెలిపారు. కొత్త ప్రభుత్వం, కేబినెట్​ సభ్యుల వివరాలను వచ్చే వారం ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

Taliban
తాలిబన్​ ప్రభుత్వ ప్రకటన
author img

By

Published : Sep 4, 2021, 4:42 PM IST

అఫ్గానిస్థాన్​ను ఆక్రమించుకున్న తాలిబన్లు(Afghan taliban).. ప్రభుత్వం ఏర్పాటు(Afghan govt formation) చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటనను వచ్చే వారానికి వాయిదా వేశారు. శుక్రవారమే ప్రకటిస్తామని చెప్పగా.. దానిని శనివారానికి వాయిదా వేశారు. తాజాగా మరోమారు వాయిదా పడినట్లు తాలిబన్​ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్​ ప్రకటించారు. "కొత్త ప్రభుత్వం, కేబినెట్​ సభ్యుల వివరాల ప్రకటన వచ్చే వారం ఉంటుంది," అని శనివారం తెలిపారు ముజాహిద్​. కాగా.. అంతర్జాతీయ సమాజం ఆమోదం పొందేలా నాయకత్వానికి తుదిరూపు ఇవ్వటంలో తాలిబన్లు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.

తాలిబన్​ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్​ ఘనీ బరాదర్​ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై శనివారం తుది ప్రకటన వస్తుందని అంతా భావించారు. అయితే.. మరోమారు వాయిదా వేయటం వల్ల తాలిబన్ల మధ్య అంతర్గతంగా విబేధాలు ఉన్నాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుపై వివిధ గ్రూప్​లతో చర్చించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు ఖలీల్​ హక్కానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ఆమోదించేలా ఉండే విస్తృతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబన్లు భావిస్తున్నారని, అందుకే జాప్యం జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.

'తాలిబన్లు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలరు. కానీ, వారి పరిపాలనా విభాగంలో అన్ని పార్టీలు, గ్రూప్​లు, సమాజంలోని పలువురికి సముచిత స్థానం కల్పించాలని భావిస్తున్నారు. తాలిబన్లతోనే కూడిన ప్రభుత్వాన్ని ప్రపంచం ఆమోదించకపోవచ్చు. అఫ్గాన్​ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్​ ఘనీ సోదరుడు గుల్బుద్దీన్​ హెక్మాత్యార్​కు ప్రభుత్వంలో స్థానం కల్పించనున్నారు. ప్రభుత్వానికి కూడగట్టేందుకు ఇతర భాగస్వామ్య గ్రూప్​లతోనూ చర్చలు చేపడుతున్నారు.'

- ఖలీల్​ హక్కానీ, ప్రభుత్వ ఏర్పాటు కమిటీ సభ్యుడు

కాబుల్​కు పాక్ నిఘా​ అధినేత

పాకిస్థాన్​ నిఘావిభాగం అధినేత జనరల్​ ఫైజ్​ హమీద్​ ఆకస్మికంగా అఫ్గాన్​ రాజధాని కాబుల్​లో పర్యటించారు. ఈ విషయాన్న పాక్​ అధికారులు వెల్లడించారు. తాలిబన్​ నాయకత్వంతో ఎలాంటి చర్చలు చేపట్టారనేది ప్రస్తుతానికి తెలియదన్నారు.

ఇదీ చూడండి: తాలిబన్‌ ప్రభుత్వాధినేతగా ముల్లా బరాదర్‌!

Taliban on Kashmir: కశ్మీర్​పై మాట మార్చిన తాలిబన్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.