ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో హక్కులపై ఉద్యమాలు చేస్తున్నారు ఎల్జీబీటీలు. కొన్ని దేశాలు వారికి ప్రత్యేక హక్కులూ కల్పిస్తున్నాయి. ఆసియాలోని దేశాల్లోనూ స్వలింగ సంపర్కుల హక్కుల సాధనకై పోరాటలు జరుగుతున్నాయి.
ఈ తరుణంలో తైవాన్ దేశం స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించింది. ఆ దేశంలో శుక్రవారం అధికారికంగా రెండు ఎల్జీబీటీ జంటలు పెళ్లిళ్లు చేసుకున్నాయి. ఆసియాలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించడం ఇదే ప్రథమం. అక్కడి ప్రభుత్వ కార్యాలయాలు స్వలింగ దంపతుల వివాహ రిజిస్ట్రేషన్‌కు ఆమోదం తెలిపాయి.
రెండు జంటలు(ఒక పురుష జంట, ఓ మహిళా జంట) తైపీ నగరంలోని ప్రభుత్వ కార్యాలయానికి చేరుకున్నాయి. వివాహ ధ్రువీకరణ పత్రంపై ఆ నలుగురు సంతకాలు చేశారు.
ఇదీ చూడండి: భారత్ తీర్పు: పనిచేయని ప్రియాంక మ్యాజిక్