ETV Bharat / international

ఏడు గంటల పాటు చైనా వ్యోమగాముల స్పేస్​వాక్ - చైనా వ్యోమగాములు

అంతరిక్షంలోకి చైనా పంపించిన వ్యోమగాములు స్పేస్​వాక్ పూర్తి చేశారు. దాదాపు 7 గంటల పాటు స్పేస్ స్టేషన్ బయట గడిపారు. ఈ దృశ్యాలను చైనా అధికారిక మీడియా ప్రసారం చేసింది.

Taikonauts in first space walk to assemble robotic arm
చైనా వ్యోమగాముల స్పేస్​వాక్
author img

By

Published : Jul 4, 2021, 5:15 PM IST

చైనా వ్యోమగాముల స్పేస్ వాక్ వీడియో

అంతరిక్షంలోకి చైనా పంపిన ఇద్దరు వ్యోమగాములు విజయవంతంగా తొలి స్పేస్​వాక్ పూర్తిచేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్పేస్​స్టేషన్ బయటకు వచ్చి.. దాదాపు ఏడు గంటల పాటు గడిపారు.

కెమెరాలు, ఇతర పరికరాలను అమర్చేందుకు వ్యోమగాములు లియు బోమింగ్, టాంగ్ హోంగ్​బో బయటకు వచ్చారు. 15 మీటర్ల పొడవైన రోబో చెయ్యి సాయంతో పరికరాలను అమర్చారు. చైనా స్పేస్ ఏజెన్సీ విడుదల చేసిన ఈ దృశ్యాలను అక్కడి అధికారిక టీవీ ఛానల్ ప్రసారం చేసింది. మూడో వ్యోమగామి నీ హైషెంగ్.. స్పేస్​ స్టేషన్ లోపలే ఉన్నట్లు తెలిపింది.

స్పేస్ మిషన్

మూడు నెలల మిషన్ కోసం ఈ వ్యోమగాములు జూన్ 17న అంతరిక్షానికి చేరుకున్నారు. స్పేస్​స్టేషన్ నిర్మాణంలో భాగంగా.. ఇప్పటికే మూడు ప్రయోగాలు చేసింది చైనా. తొలి మాడ్యూల్​ను​ ఏప్రిల్ 29న ప్రయోగించగా.. రెండో దశలో ఆహారం, ఇంధనాన్ని ఆటోమేటెడ్ స్పేస్​క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షానికి చేరవేసింది. తర్వాతి ప్రయోగంలో భాగంగా.. ముగ్గురు వ్యోమగాములను పంపించింది.

స్పేస్ స్టేషన్ నిర్మాణం​ కోసం మొత్తం 11 ప్రయోగాలను చేపట్టాలని చైనా నిర్ణయించింది. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.