ఇండోనేసియా సులవేసి ఐలాండ్‌లోని రోమన్ క్యాథలిక్ చర్చిపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 9 మందికిపైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
ఆదివారం చర్చికి పెద్ద సంఖ్యలో జనం చేరుకున్న క్రమంలో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
దక్షిణ సులవేసి ప్రావిన్స్ రాజధాని మకస్సార్లోని చర్చి వద్ద ద్విచక్రవాహనంలో బాంబులతో వచ్చిన దుండగుడు తనను తాను పేల్చుకున్నట్లు సమాచారం.