ETV Bharat / international

లావా లావా.. నీలం రంగులో ఉన్నావా? - నీలం రంగులో లావా

అగ్నిపర్వతం.. విస్ఫోటం చెందితే ఎర్రటి అగ్నిగోళంలా ఉంటుంది. దాన్నుంచి మండుతున్న లావా దారలుగా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఓ అగ్ని పర్వతం మాత్రం నేను చాలా విభిన్నం అంటోంది. నీలం రంగులోనే కనిపిస్తానని చెప్తోంది. ఆ విశేషాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.

blue color volcano
లావా లావా.. నీలం రంగులో ఉన్నావా?
author img

By

Published : Jun 14, 2020, 2:40 PM IST

భూమి.. మానవుడికి ఆవాసమే కాదు ఎన్నో వింతలు, విశేషాలకు పుట్టినిల్లు. మనుషులతో పాటు పలు జీవరాసులు ఈ ధరణిపై కలిసి నివసిస్తున్నాయి. అలాంటి ఈ పుడమిపై అగ్నిపర్వతాలూ ఓ భాగమే. ఇవి వేడి వేడి పొగలు కక్కుతూ.. ఎర్రటి లావాను వెదజల్లుతూ ఉంటాయి. అయితే వీటిల్లోనూ చాలా రకాలుంటాయి. లావాతో పాటు కొన్ని పొగ, బూడిదను విడుదల చేస్తుంటాయి.

ఇండోనేషియాలోని కావా ఐజెన్​ అగ్నిపర్వతం మరింత భిన్నం. ఎందుకంటే దీని నుంచి వచ్చే అగ్నిజ్వాలలు నీలం రంగులో కనిపిస్తాయి. అందుకే ఎంతోమంది వీక్షకుల మదిని దోచింది కావా ఐజెన్. ఈ అగ్నిపర్వతం రంగుకు కారణం సల్ఫ్యూరిక్​ వాయివులని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఎంతో సుందరంగా ఉండే ఇది.. 600 డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రతతో మరుగుతూ ఉంటుందట. అప్పుడప్పుడూ గాలి తోడై 16 అడుగుల ఎత్తైన మంటలు వెదజల్లుతుందట.

ఇండోనేషియా తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వస్తుంటాయి. అందుకే దీన్ని పసిఫిక్‌ 'రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌'లో ఓ భాగం అంటారు. ఈ దేశంలో 400 అగ్ని పర్వతాలుంటే వాటిలో 150 క్రియాశీలకమైనవే. ప్రపంచంలో ప్రమాదకర అగ్నిపర్వతాల్లో 75 శాతం ఇక్కడే ఉన్నాయి.

ఇదీ చూడండి: ఈ భారతీయ 'ప్రపంచ' అందాలకు ఫిదా అవ్వాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.