ETV Bharat / international

'ఆ దేశాల్లో 7 ట్రిలియన్ డాలర్ల చోరీ ఆస్తులు'

వివిధ దేశాల నుంచి దొంగిలించిన 7 ట్రిలియన్​ డాలర్ల విలువైన ఆస్తులన్నీ.. ఆర్థికంగా ఎదిగిన దేశాల్లోకి చేరుకున్నాయని పాకిస్థాన్​ ప్రధాన మంత్రి ఇమ్రాన్​ ఖాన్​ అన్నారు. ఆ ఆస్తులు తిరిగి వచ్చినప్పుడే ఆ దేశాలు అభివృద్ధిని సాధిస్తాయని తెలిపారు.

pakistan prime minister about stolen asserts
ఆ దేశాల్లో 7 ట్రి.డాలర్ల చోరీ ఆస్తులు: ఇమ్రాన్​
author img

By

Published : Feb 26, 2021, 5:50 AM IST

పేద దేశాల నుంచి దొంగిలించిన ఏడు ట్రిలియన్​ డాలర్ల విలువైన ఆస్తులు.. కొన్ని ఆర్థిక సురక్షిత దేశాల్లోకి చేరుకున్నాయని పాకిస్థాన్​ ప్రధాన మంత్రి ఇమ్రాన్​ ఖాన్​ వ్యాఖ్యానించారు. అందువల్లే ఆ దేశాలన్నీ ఇంకా అభివృద్ధి చెందే దశలో ఉండిపోతున్నాయని పేర్కొన్నారు. 2030 అభివృద్ధి ఎజెండాలో భాగంగా.. అంతర్జాతీయ ఆర్థిక జవాబుదారీతనం, పారదర్శకత, సమగ్రత(ఏఎఫ్​సీటీఐ) ప్యానెల్​ రూపొందించిన తుది నివేదిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన వర్చువల్​గా పాల్గొన్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి దొంగిలించిన ఏడు ట్రిలియన్​ డాలర్ల ఆస్తులు.. ఆర్థికంగా ఎదిగిన దేశాల్లోకి చేరిపోయాయి. అందువల్లే ఆ దేశాలు ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉండిపోతున్నాయి.పేదరికం, అసమానతలు, రాజకీయ అస్థిరతలు అక్కడ ఉంటున్నాయి.

-ఇమ్రాన్​ ఖాన్​, పాకిస్థాన్​ ప్రధాన మంత్రి

ఈ ఆర్థిక ప్రవాహానికి అడ్డుకట్టపడి, ఆ ఆస్తులన్నీ వెనక్కు వస్తే.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మార్పు కనిపిస్తుందని ఇమ్రాన్​ ఖాన్​ అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:ఉపఖండంలో విభేదాలకు చర్చలే పరిష్కారం: పాక్​ ప్రధాని​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.