శ్రీలంక పార్లమెంటు ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. 225 నియోజకవర్గాలకు గానూ 196 స్థానాల్లో అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. వైరస్ విస్తరిస్తున్న తరుణంలో కట్టదిట్టమైన చర్యల నడుమ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆ దేశ ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇప్పటికే కరోనా వల్ల రెండుసార్లు ఎన్నికలు వాయిదా పడ్డాయి.
ఓట్ల లెక్కింపులో మార్పు
గతంలో ఓట్ల లెక్కింపు ఎన్నికలు జరిగిన రోజు రాత్రి 8 గంటలకు నుంచి ప్రారంభించేవారు. ఈ సారి పోలింగ్ మరుసటి రోజు ఉదయం ప్రారంభించబోతున్నారు.
మళ్లీ ప్రధాని కావాలి!
ప్రధాని పదవిని చేజిక్కించుకుని మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలని భావిస్తోంది రాజపక్స కుటుంబం. సార్వత్రిక ఎన్నికల్లో శ్రీలంక పీపుల్స్ పార్టీ(ఎస్‌ఎల్‌పీపీ) మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తుందని అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఆశిస్తున్నారు. ఆయన అనుకున్నట్లు జరిగితే దేశాధ్యక్షుని అధికారాలను పునరుద్ధరిస్తూ రాజ్యాంగ సవరణ చేయడానికి వీలవుతుంది.
విజయం పక్కా..!
ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఘోరంగా చీలికలు ఏర్పడినందువల్ల... ఎస్‌ఎల్‌పీపీకే విజయం సాధించిన అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిపొంది, తిరిగి ప్రధాని పదవిని చేపట్టాలని మహీంద రాజపక్స ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు గొటబాయ సోదరుడే మహీంద. రాజపక్స కుటుంబ సభ్యులే ఐదుగురు ఈ ఎన్నికల బరిలో దిగుతున్నారు.
తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు ఎస్‌ఎల్‌పీపీ నేషనల్ ఆర్గనైజర్ బసిల్ రాజపక్స. తమ పార్టీకి వచ్చే ఓట్లలో కనీసం సగమైనా ప్రతిపక్షాలకు రావన్నారు. రాజకీయ పరిశీలకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎల్పీపీకి ఎన్ని సీట్లు వస్తాయనేదే ముఖ్యమైన విషయమని... ఆ పార్టీ విజయం గురించి చింతనే లేదంటున్నారు.
ఇదీ చూడండి: కరోనా పుట్టుకపై డబ్ల్యూహెచ్ఓ-చైనా పరిశోధన