ETV Bharat / international

శ్రీలంక బౌద్ధాలయాల్లో ఉగ్రదాడులు!

శ్రీలంకలోని బౌద్ధాలయాలపై ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని నిఘావర్గాలు హెచ్చరించాయి. భక్తులే లక్ష్యంగా ఆత్మాహుతి దళ మహిళా సభ్యులు దాడుల్లో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నాయి. శ్రీలంకలో వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో బురఖాల వాడకాన్ని నిషేధించింది అక్కడి ప్రభుత్వం.

శ్రీలంక
author img

By

Published : Apr 29, 2019, 4:04 PM IST

Updated : Apr 29, 2019, 7:48 PM IST

శ్రీలంక మరిన్ని ఉగ్రదాడులు!

శ్రీలంకలో మరిన్ని ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. బౌద్ధాలయాలే లక్ష్యంగా మహిళా ఆత్మాహుతి దళం దాడులకు పాల్పడనున్నట్టు సమాచారం సేకరించాయి లంక నిఘా సంస్థలు.

ఈస్టర్​ నాటి పేలుళ్ల తర్వాత ఓ ఇంటిలో తెల్లటి వస్త్రాలను గుర్తించారు పోలీసులు. వాటికి సంబంధించిన విచారణలో భాగంగా మరిన్ని అంశాలను శ్రీలంక నిఘా సంస్థ పసిగట్టింది. ఈ దుస్తులు నిషేధిత ఉగ్రసంస్థ తౌవీద్ జమాత్​కు చెందిన మహిళా ఆత్మాహుతి సభ్యులవిగా గుర్తించారు.

మొత్తం 9 మందికి సరిపోయే తెల్లటి వస్త్రాలను కొనుగోలు చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. అయితే ఇంటిలో మాత్రం ఐదుగురికి సరిపడే దుస్తులు మాత్రమే కనిపించాయి. ఇందులో ఒకరు ఈస్టర్​ దాడిలో పాల్గొన్నట్టు నిఘా సంస్థ చెబుతోంది.

బురఖాలపై నిషేధం

శ్రీలంకలో ఈస్టర్​ నాడు జరిగిన ఆత్మాహుతి దాడులను అక్కడి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. మరిన్ని దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటోంది. తాజాగా ముస్లిం మహిళలు బురఖాలు ధరించడంపై దేశంలో నిషేధం విధించింది. ఈ విషయాన్ని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అధికారికంగా ప్రకటించారు.

శ్రీలంకలో జరిగిన ఈస్టర్​ ఆత్మాహుతి దాడుల్లో 253 మంది పౌరులు మరణించారు. మరో 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటివరకు దాడులకు సంబంధించి 106 మంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

ఇదీ చూడండి: కిరణ్​ కోసం యూఏఈ అసాధారణ నిర్ణయం

AP Video Delivery Log - 0900 GMT News
Monday, 29 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0859: China MOFA Briefing AP Clients Only 4208276
DAILY MOFA BRIEFING
AP-APTN-0847: South Korea Chile AP Clients Only 4208274
Pinera and Moon comment after talks in Seoul
AP-APTN-0838: Turkey Sural Part no access Turkey; No access by Med Nuce, Sterk TV, Rohani TV, Newroz TV, Al Jazeera Media Network 4208271
Czech international Sural dead after Turkey crash
AP-APTN-0816: India Elections 2 AP Clients Only 4208268
Kashmir votes in 4th phase of India election
AP-APTN-0816: North Korea Kim No access North Korea 4208267
NKorea state TV shows Kim returning from Russia
AP-APTN-0756: Canada Floods Must credit CTV; No access Canada 4208264
Broken Quebec dike forces evacuations in Canada
AP-APTN-0746: Malaysia Najib AP Clients Only 4208262
Najib fails to have corruption charges dismissed
AP-APTN-0739: Philippines Fire 2 AP Clients Only 4208261
No injuries reported in fire at Manila building
AP-APTN-0706: India Elections AP Clients Only 4208258
West Bengal votes in 4th phase of India election
AP-APTN-0704: STILLS Sural AP Clients Only 4208257
Czech international Sural dead after Turkey crash
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 29, 2019, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.