ETV Bharat / international

'శ్రీలంకకు ఐసిస్​ నుంచి పొంచి ఉన్న ముప్పు' - ఐసిస్​

ఈస్టర్​ రోజున జరిగిన బాంబు దాడులతో సంబంధాలున్న ఉగ్రవాదులు తమ పోలీసుల అదుపులో ఉన్నారని శ్రీలంక ప్రధాని విక్రమ సింఘే తెలిపారు. కొందరు ముష్కరులను భద్రతా దళాలు  హతమార్చాయని ప్రకటించారు. అయితే దేశానికి ఇంకా ఐసిస్​ నుంచి ఉగ్రదాడుల ముప్పు ఉందని తెలిపారు.

శ్రీలంక ప్రధాని విక్రమ సింఘే
author img

By

Published : May 8, 2019, 6:55 AM IST

Updated : May 8, 2019, 8:10 AM IST

తమ దేశానికి ఇంకా ఐసిస్ నుంచి ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందన్నారు శ్రీలంక ప్రధానమంత్రి విక్రమ సింఘే. ఈస్టర్​ రోజున బాంబు దాడులకు తెగబడిన ఉగ్రవాదులను తమ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, కొందరిని హతమార్చారని తెలిపారు. దేశంలోని ప్రస్తుత భద్రతా పరిస్థితిపై పార్లమెంటులో చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

ఐసిస్​ హస్తం

ఈస్టర్​ రోజున బాంబు దాడులకు తెగబడిన ముష్కరులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉగ్రసంస్థ ఐసిస్​తో సంబంధాలు ఉన్నట్టు దర్యాప్తులో తేలిందని చెప్పారు విక్రమ సింఘే. ఉగ్రవాదుల గురించిన సమాచారాన్ని త్వరగా తెలుసుకునేందుకు మరింత అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రమాదం ఇంకా ముగియలేదని అన్నారు.

ఉగ్రవాద బాధిత దేశంగా శ్రీలంక మారిందని ఆవేదన వ్యక్తం చేశారు విక్రమ సింఘే. ఉగ్రవాదంపై పోరాడేందుకు ప్రపంచ దేశాలతో కలిసి పని చేస్తామన్నారు. అయితే వేరే దేశాల నుంచి బలగాలను మాత్రం దేశానికి తీసుకురాబోమని స్పష్టం చేశారు.

దేశం ఇప్పుడు సురక్షితంగా ఉందని, త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని సోమవారమే ప్రకటించారు శ్రీలంక త్రివిధ దళాధిపతులు, పోలీసు ఉన్నతాధికారులు. దాడులకు సంబంధించి ఇప్పటి వరకు 73 మందిని అదుపులోకి తీసుకున్నట్టు వారు వెల్లడించారు.

ఏప్రిల్​ 21న శ్రీలంకలో జరిగిన తొమ్మిది బాంబు పేలుళ్లలో దాదాపు 250 మంది మృతి చెందారు. 500మందికి పైగా గాయపడ్డారు.

AP Video Delivery Log - 1800 GMT News
Tuesday, 7 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1756: Venezuela National Assembly 3 AP Clients Only 4209796
Guaido addresses Venezuela National Assembly
AP-APTN-1755: US GA Abortion Law AP Clients Only 4209795
Georgia governor signs 'heartbeat' abortion ban
AP-APTN-1730: UK Royal Baby Reaction 2 AP Clients Only 4209773
More from William and Kate on royal baby birth
AP-APTN-1720: US Trumps Be Best AP Clients Only 4209790
1 year on - Melania Trump expands 'Be Best' campaign
AP-APTN-1709: US NY Pelosi AP Clients Only 4209789
Pelosi disputes GOP, says Russia case 'not closed'
AP-APTN-1707: Bulgaria Rescued Bears AP Clients Only 4209788
Rescued baby bears released into wild in Bulgaria
AP-APTN-1653: Sri Lanka President AP Clients Only 4209784
SLanka president: 99% of attacks suspects arrested
AP-APTN-1647: North Macedonia Pope Departure AP Clients Only 4209781
Pope Francis departs North Macedonia
AP-APTN-1642: UK Queen Luncheon AP Clients Only 4209746
UK Queen hosts lunch at Windsor
AP-APTN-1642: US R Kelly Court AP Clients Only 4209779
R Kelly back in court for hearing on sex-abuse case
AP-APTN-1637: UK European Elections AP Clients Only 4209778
UK govt confirms European elections will go ahead
AP-APTN-1630: US FBI Russia Probe AP Clients Only 4209777
FBI chief: No evidence of spying on Trump campaign
AP-APTN-1601: Germany UK Royals 2 AP Clients Only 4209770
UK's Prince Charles visits Brandenburg Gate
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 8, 2019, 8:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.